news18-telugu
Updated: October 11, 2019, 7:51 PM IST
రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణే (ఇన్స్టాగ్రామ్ ఫోటో)
బాలీవుడ్ హాట్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇటీవల ఇన్‌స్టా గ్రామ్ లైవ్ సెషన్లో రణ్వీర్ సింగ్‌కు దీపికా పెట్టిన కామెంట్ అందుకు ఆజ్యం పోసింది. రణ్ వీర్ సింగ్‌ను ‘హాయ్, డాడీ’ అంటూ కామెంట్ చేసింది. దానికి పక్కనే ఓ పసిబిడ్డ ఫొటో, లవ్ సింబల్ కూడా పెట్టింది. దీంతో అభిమానులు అందరూ షాక్‌కి గురయ్యారు. వారిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. దీనికి తగ్గట్టు అర్జున్ కపూర్ కూడా ఆ వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోశాడు. ‘బాబా.. నీకు బాబీ (వదిన) త్వరలో గిఫ్ట్ ఇవ్వబోతోంది.’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో దీపిక ప్రెగ్నెంట్ అనే విషయం ఖాయం అనుకున్నారు.

దీపిక పదుకొనే (Source: Twitter)
తాను గర్భవతిని అంటూ వస్తున్న వార్తలపై దీపికా పదుకొనే స్పందించింది. ‘రూమర్లు విని నేనేం సర్ప్రైజ్ కావట్లేదు. మాకు పిల్లలు కావాలా అంటే కావాలి. మాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ, ఇప్పుడే పిల్లలు కనాలన్న ఆత్రుతలో మేం లేము. కనీసం ఆ దిశగా కూడా మేం ఆలోచించడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే మేం స్వార్ధపూరితంగా మా కెరీర్ మీదే దృష్టి పెట్టాం.’ అని చెప్పింది. దీంతోపాటు ఓ సొసైటీ ఎలా ఆలోచిస్తుందనే విషయాన్ని కూడా తెలిపింది. ‘ఎవరితో అయినా చాలా రోజుల నుంచి డేటింగ్ చేస్తుంటే.. పెళ్లెప్పుడు? పెళ్లెప్పుడు? అంటారు. అదే పెళ్లి చేసుకుంటే.. పిల్లలు ఎప్పుడు అంటారు. ఆ తర్వాత మనవళ్లు, మనవరాళ్లు అంటారు.’ అని చెప్పింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 11, 2019, 7:51 PM IST