దీపికా, ప్రియాంకలకు అభిమానులకు చేదు వార్త.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రియాంక చోప్రా,దీపికా పదుకొణే (File Photo)

బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రాలకు ఈ సారి ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కలేదు. గత కొన్నేళ్లుగా ఈ మ్యాగజైన్‌లో ప్రకటించే జాబితాలో చోటు దక్కించుకునే వీళ్లిద్దరు.. తాజాగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కకపోవడం చూసి దీపికా, ప్రియాంక అభిమానులు ఫీలవుతున్నారు.

  • Share this:
    బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రాలకు ఈ సారి ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కలేదు. గత కొన్నేళ్లుగా ఈ మ్యాగజైన్‌లో ప్రకటించే జాబితాలో చోటు దక్కించుకునే వీళ్లిద్దరు.. తాజాగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కకపోవడం చూసి దీపికా, ప్రియాంక అభిమానులు ఫీలవుతున్నారు. ఫేమస్ అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2019 ఏడాదికి గాను ప్రపంచంలో ఎక్కువ సంపాదన ఉన్న నటీమణులు జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో హాలీవుడ్ బ్యూటీ స్కార్లెట్ జోహన్సన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. గతేడాది ప్రకటించిన ఫోర్బ్స్ జాబితాలో ఆమె ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. తాజాగా స్కార్లెట్ నటిస్తోన్న ‘బ్లాక్ విండ్’ చిత్రం కోసం ఆమె ఫేమస్ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మార్వెల్ స్టూడియోస్ నుంచి ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆమె 2019లో దాదాపు 56 మిలియన్ డాలర్లు సంపాదించింది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.400 కోట్లు.

    ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కని ప్రియాంక,దీపికా (file photos)


    ఈ జాబితాలో 44.1 మిలియన్ డాలర్స్ సంపాదనతో సోఫియా వర్గరా రెండో ప్లేస్‌లో నిలిచింది. మన కరెన్సీలో రూ.315 కోట్లు ఆర్జించింది. ఇందులో మన దేశం నుంచి ఎవరు లేకపోవడం నిరాశ కలిగించే విషయమే. ఈ జాబితాను ఫోర్బ్స్ 1 జూన్ 2018 నుంచి 1 జూన్ 2019 మధ్య కాలంలో వాళ్ల సంపాదనతో పాటు వాళ్లు కట్టిన ఇన్‌టాక్స్ ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ఇక మన హీరోల విషయానికొస్తే.. మన దేశం నుంచి ఈ జాబితాలో అక్షయ్ కుమార్ ఒక్కరే నిలవడం విశేషం.  రూ. 466 కోట్ల సంపాదనతో మన దేశంలో ఎక్కువ ఆర్జిస్తున్న నటుడిగా అక్షయ్ రికార్డులకు ఎక్కాడు.
    First published: