#MeToo : మీటూ విషయమై వాళ్లను టార్గెట్ చేసిన దీపికా పదుకొనే..

మీటూ ఉద్యమం పై తాజాగా దీపికా పదుకొనే స్పందించారు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న దీపికను మీటూ ఉద్యమం గురించి అడగ్గా... ఆమె స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 11, 2019, 12:06 PM IST
#MeToo : మీటూ విషయమై వాళ్లను టార్గెట్ చేసిన దీపికా పదుకొనే..
Instagram/deepikapadukone
news18-telugu
Updated: October 11, 2019, 12:06 PM IST
మీటూ ఉద్యమంతో తమపై జరుగుతున్న లైంగిక నేరాలను మహిళలు వివిధ వేదికలపై ఒక్కొక్కరుగా బయట పెట్టిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలు వ్యక్తిగత జీవితంలో వారు ఎదుర్కొన్న లైంగిక హింస గురించి ప్రపంచానికి  తెలియపరిచారు. అది అలా ఉంటే మీటూపై తాజాగా దీపికా పదుకొనే స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీపికను మీటూ గురించి అడగ్గా... ఆమె స్పందిస్తూ.. అసలు ఎందుకు.. మీటూ ఉద్యమాన్ని కేవలం సినీ ఇండస్ట్రీకే పరిమితం చేస్తున్నారు.. మహిళలపై లైంగింక వేదింపులు అన్నిరంగాల్లోను ఉన్నాయి. మీరెందుకని క్రికెటర్స్‌ను లేదా క్రిడాకారుల్నీ ఈ విషయం గురించి అడగరు అంటూ ఎదురూ ప్రశ్నించింది.



 




Loading...

View this post on Instagram





 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on





కాగా మీటూ ఉద్యమం మన దేశంలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాతో ఊపందుకుంది. పదేళ్ల క్రితం ఓ సినిమా షూటింగులో సీనియర్ నటుడు నానా పాటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసి సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఒక్కసారిగా దేశంలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. అందులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ ప్రియా రమణి, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేయడం, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.



 




View this post on Instagram





 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on




First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...