హోమ్ /వార్తలు /సినిమా /

Deepika Padukone: దీపికాకు అరుదైన గౌరవం.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీగా మన హీరోయిన్

Deepika Padukone: దీపికాకు అరుదైన గౌరవం.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీగా మన హీరోయిన్

Deepika Padukone

Deepika Padukone

దీపిక నటనకు విమర్శలుండవు. ఏ పాత్ర చేసినా అలా ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. తొలిసినిమా ఓంశాంతి ఓంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీపికాకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది.

ఓం శాంతి ఓం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ దీపికా పదుకొణె. షారుక్ సరసన హీరోగా ఫస్ట్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. మొదటి మూవీ అయినప్పటికీ.. దీపికా తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. విమర్శకుల చేత కూడా ప్రశంసలందుకుంది. ఆ సినిమా హిట్‌తో దీపికా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా బాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించే అవకాశం కొట్టేసింది. యంగ్ హీరోలతో కూడా జంట కట్టింది. తాజాగా దీపికాకు మరో అరుదైన అవకాశం దక్కింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో మన దీపికా జ్యూరీగా ఎంపికైంది.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న 75 వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీలో దీపికా పదుకొణె భాగం అయింది. 75వ ఎడిషన్‌ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ జ్యూరీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇందులో దీపిక భాగమైంది. దీపిక తో పాటు రెబెక్కా హాల్, నూమి రాపేస్, జాస్మిన్ ట్రింకా, అస్గర్ ఫర్హాది, లాడ్జ్ లై, జెఫ్ నికోల్స్, జోచిమ్ ట్రియర్‌లు ఉన్నారు. మే 17 నుంచి 28 వరకు 10 రోజులపాటు ఈ వేడుక జరగనుండగా 28న కాన్స్‌లో ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక జరగనుంది. ఈ పది రోజులు దీపికా పదుకొణె ఈ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ మెంబర్ గా ఉండనుంది.

సమాచారం ప్రకారం.. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ కంపెనీ అయిన లూయిస్ విట్టన్‌తో తన సహకారంలో భాగంగా దీపిక ఈ సంవత్సరం కేన్స్‌లో పెద్దగా కనిపించనుంది. అంతేకాకుండా, దీపిక బ్రాండ్ గ్లోబల్ అంబాసిడర్‌లలో ఒకరిగా కూడా సంతకం చేయబడింది. బాలీవుడ్ నుంచి ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎప్పుడూ ఒక స్టైల్ స్టేట్‌మెంట్ ఇస్తారు, అయితే ప్రతి లుక్‌ను నెయిల్ చేసిన అతి కొద్దిమందిలో దీపికా పదుకొనే ఒకరు. వాస్తవానికి, ఆమె గత రెండు సంవత్సరాల నుండి రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తున్నారు.

మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరుస సినిమాలతో బిజిబిజీ గా ఉంది. ఇటీవలే 83, గెహ్రాయాన్ వెబ్ సిరీస్‌లో నటించిన దీపికా పదుకొణె ప్రస్తుతం మరో నాలుగు సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో కూడా ఈ భామ తొలిసారిగా నటిస్తోంది. డార్లింగ్ ప్రభాస్ తో కూడా ‘ప్రాజెక్టు k’ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సినిమా ఈవెంట్లలో పాల్గొన్న దీపికకు గత కొన్ని సంవత్సరాలుగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ లో భాగమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా కాన్స్ ఫెస్టివల్‌ జ్యూరీలో దీపికా ఉండటంతో ఆమెకు అరుదైన గౌరవం దక్కిందని దీపికా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

First published:

Tags: Deepika Padukone, Hollywood, Project K

ఉత్తమ కథలు