నా మొగుడికి ఇప్పుడు అదొక్కటే పని.. రణ్‌వీర్‌పై దీపిక కామెంట్స్..

Deepika Ranveer singh: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకోనె, రణ్‌వీర్ సింగ్ కూడా తమ లాక్ డౌన్ ముచ్చట్ల గురించి చెబుతున్నారు. అందులో ముఖ్యంగా తన భర్త గురించి దీపిక కొన్ని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 1, 2020, 4:58 PM IST
నా మొగుడికి ఇప్పుడు అదొక్కటే పని.. రణ్‌వీర్‌పై దీపిక కామెంట్స్..
రణ్‌వీర్, దీపిక
  • Share this:
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా లాక్ డౌన్ ఉంది. దాంతో బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు.. వెళ్తే ఊరుకోరు. అన్నింటికి మించి సెలబ్రిటీస్ కాబట్టి పదిమందికి ఆదర్శంగా ఉండాలి. అందుకే ఇంట్లోనే ఉంటున్నారు అంతా. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకోనె, రణ్‌వీర్ సింగ్ కూడా తమ లాక్ డౌన్ ముచ్చట్ల గురించి చెబుతున్నారు. అందులో ముఖ్యంగా తన భర్త గురించి దీపిక కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది. ఇది తెలిసి అభిమానులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు ఈ ఇద్దరూ.

రణ్‌వీర్, దీపిక (Ranveer singh Deepika)
రణ్‌వీర్, దీపిక (Ranveer singh Deepika)


21 రోజుల లాక్ డౌన్ కాబట్టి ఇంట్లో ఉండటం తప్ప చేసేదేం లేదు.. దాంతో ఏం చేయాలో తెలియక తన భర్త ఒకటే పని చేస్తున్నాడని చెబుతుంది దీపిక. ఇన్నాళ్లూ సినిమా షూటింగ్స్‌తో బాగా అలిసిపోయిన రణ్‌వీర్ సింగ్.. ఇప్పుడు నిద్రతో బిజీ అయిపోయాడని చెబుతుంది దీపిక. ఈ లాక్ డౌన్ సమయాన్ని తన భర్త రణ్‌వీర్ పూర్తిగా యూజ్ చేసుకుంటున్నాడని చెబుతుంది ఈమె. రోజులో 20 గంటలు నిద్రకే కేటాయిస్తున్నాడని.. మిగిలిన 4 గంటలలో సినిమాలు, టీవీ చూస్తున్నాడని చెబుతుంది దీపిక.

రణ్‌వీర్, దీపిక (Ranveer singh Deepika)
రణ్‌వీర్, దీపిక (Ranveer singh Deepika)


ఎలాంటి టెన్షన్స్ లేకుండా లైఫ్ గడిపేస్తున్నాడని చెబుతుంది. ముఖ్యంగా తనకు వంట బాగా వచ్చు కాబట్టి హాయిగా తినేసి పడుకుంటున్నాడని చెబుతుంది దీపిక. ఇటాలియన్, వెస్టర్న్, కాంటినెంటల్ వంటలు బాగా చేస్తానని చెబుతుంది దీపిక. ఇక తన మొగుడు మాత్రం అస్సలు వంట రూమ్‌లోకి రాడని చెబుతుంది ఈమె. అన్నింటికి మించి లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా కుటుంబంతోనే గడిపి.. వాళ్లకు అండగా ఉండాలని సూచిస్తుంది దీపిక. ప్రభుత్వం చెప్పినట్లు ఈ లాక్ డౌన్ రోజుల్లో బయటికి రాకుండా ఉండాలని చెబుతుంది ఈ హీరోయిన్.
Published by: Praveen Kumar Vadla
First published: April 1, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading