news18-telugu
Updated: October 29, 2019, 2:13 PM IST
‘దీపికా పదుకొణే’ (Instagram/photo)
బాలీవుడ్లో వరుస హిట్ సినిమాలతో దూకుడు మీదుంది దీపికా పదుకొణే. కెరీర్ పీక్‌లో ఉన్నపుడే తోటి నటుడు రణ్వీర్ సింగ్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు దూకుడు కూడా మాములుగా లేదు. పెళ్లి తర్వాత దీపికా.. తన భర్త రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘83’ బయోపిక్‌లో కపిల్ దేవ్ భార్య పాత్రలో నటిస్తోంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉండే దీపికా పదుకొణే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను అనుసరించిన వాళ్లు 4 కోట్లకు చేరుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా 4 కోట్ల మంది కంటే కొంచెం ఎక్కువగా ఫాలోవర్స్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానంలో దీపికా నిలవడం విశేషం.

దీపికా పదుకొణే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ (Instagram/Photo)
ప్రస్తుతం దీపికా 83 బయోపిక్‌తో పాటు చపాక్ సినిమా విడుదలకు రెడీగా ఉంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 29, 2019, 2:13 PM IST