హోమ్ /వార్తలు /సినిమా /

ప్రభాస్‌తో యాక్ట్ చేయడానికి దీపికా దిమ్మ దిరిగే కండిషన్స్ ఇవే..

ప్రభాస్‌తో యాక్ట్ చేయడానికి దీపికా దిమ్మ దిరిగే కండిషన్స్ ఇవే..

ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)

ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)

రాధాకృష్ణ మూవీ తర్వాత ప్రభాస్.. మహానటితో ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో దీపికాను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. అంతేకాదు ఈచిత్రంలో యాక్ట్ చేసేందకు దీపికా దిమ్మ దిరిగే కండిషన్స్ చెప్పిందట.

‘సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత  అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రకటన సందర్బంగా ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది.  ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర  కోసం దేశం మొత్తం గుర్తు పట్టే హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికీ దీపికా, ఆలియా భట్‌లను సంప్రదించారు. ఆలియా భట్ .. ప్రభాస్ సరసన నటించాలని ఉన్నా.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ’బ్రహ్మాస్త్ర’ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు రెండు మూడు సినిమాలకు ఆల్రెడీ ఓకే చెప్పింది. ఆ తర్వాత దీపికా ను సంప్రదిస్తే.. ఆమె కూడా ముందుగా ఏమి  చెప్పలేదు. ప్రస్తుతం ఈ భామ.. తన భర్త రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘83’లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత దీపికా మరో సినిమా కూడా ఒప్పుకోలేదు. తాజాగా దీపికా పదుకొణే.. నాగ్ అశ్విన్ చెప్పిన కథ నచ్చడంతో పాటు.. ప్రభాస్ సరసన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమా చేయడానికి ఎట్టకేలకు ఓకే చెప్పినట్టు సమాచారం.

ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)

అయితే ఈ చిత్రంలో నటించడానికి దీపికా చెప్పిన కండిషన్స్ చూసి నిర్మాతలు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఈ సినిమాలో నటించడానికి దీపికా పెట్టిన కండిషన్ అలాంటిది మరి. ఈ చిత్రంలో యాక్ట్ చేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ చిత్రంలో యాక్ట్ చేసినందుక కాను.. నాకు ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ ఇవ్వమని కోరినట్టు సమాచారం. బాహుబలితో హీరో ప్రభాస్‌కు హిందీలో మంచి మార్కెట్ క్రియేట్ అంది. గతేడాది విడుదలైన ‘సాహో’కు ఫ్లాప్ టాక్ వచ్చినా.. మొత్తంగా రూ. 200 కోట్ల వరకు కొల్లగొట్టింది.  డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, మిగతా ఎక్స్‌పెన్సివ్ టాక్స్, అడ్వర్టైజింగ్ అన్ని పోయినా రూ. 70 కోట్ల వరకు దీపికాకు మిగిలే ఛాన్స్ ఉంది. మరి దీపికా చెప్పిన కండిషన్స్‌కు నిర్మాత ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.ఈ చిత్రం ఈ యేడాది అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

First published:

Tags: Aswani Dutt, Bollywood, Deepika Padukone, Nag Ashwin, Prabhas, Tollywood, Vyjayanthi Movies

ఉత్తమ కథలు