లైంగిక వేధింపులపై దీపికా పదుకొణే కీలక నిర్ణయం.. ఇకపై వాళ్లతో సినిమాలకు 'నో'

news18-telugu
Updated: August 8, 2019, 2:56 PM IST
లైంగిక వేధింపులపై దీపికా పదుకొణే కీలక నిర్ణయం.. ఇకపై వాళ్లతో సినిమాలకు 'నో'
దీపికా పదుకొణే (File)
  • Share this:
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారితో తాను కలిసి పనిచేయనని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే స్పష్టం చేసింది. వోగ్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా దీపికా ఈ వ్యాఖ్యలు చేసింది. దీపికా కామెంట్స్‌తో..ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందా? అన్న చర్చ మొదలైంది. అయితే దర్శకుడు లవ్ రంజన్‌ను ఉద్దేశించే ఆమె ఆ వ్యాఖ్యలు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లవ్ రంజన్‌పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం.. దీపికా పదుకొణే ఆయనతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో..రంజన్‌ను

ఉద్దేశించే దీపికా ఆ కామెంట్స్ చేసిందని భావిస్తున్నారు.నిజానికి లవ్ రంజన్‌తో సినిమాకు సంబంధించి దీపికా ఆయన ఇంటికి వెళ్లి చర్చలు కూడా జరిపింది.అప్పట్లో దీపికా లవ్ రంజన్ ఇంటికి వెళ్లిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడితో సినిమా చేస్తావా..? అంటూ చాలామందిని ఆమెను విమర్శించారు.తాజా వ్యాఖ్యల ద్వారా దీపికా ఆ విమర్శలకు చెక్ పెట్టినట్టయింది.

కాగా,దీపికా పదుకొణే గతంలోనూ సామాజిక అంశాలపై స్పందించిన సంగతి తెలిసిందే. స్వలింగ సంపర్కుల హక్కులకు ఆమె మద్దతుగా నిలిచారు. అలాగే డిప్రెషన్ బారినపడినవారికి తన సొంత అనుభవాన్ని ఓ పాఠంగా చెప్పారు. సామాజిక అంశాలపై స్పందించే దీపికా.. లవ్ రంజన్‌తో సినిమాపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందుకే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న లవ్ రంజన్‌తో సినిమా చేయకపోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Published by: Srinivas Mittapalli
First published: August 8, 2019, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading