దీపిక పదుకొనే చపక్ ట్రైలర్ విడుదల...యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో సంచలనం..

2005లో ఢిల్లీలో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ నిజ జీవిత కథ ఆధారంగా చపక్ సినిమా రూపుదిద్దుకుంది. సినిమాలో టైటిల్ పాత్రలో లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక కనిపించనుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు విక్రాంత్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

news18-telugu
Updated: December 10, 2019, 7:09 PM IST
దీపిక పదుకొనే చపక్ ట్రైలర్ విడుదల...యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో సంచలనం..
యాసిడ్ బాధితురాలిగా దీపికా పదుకొనే
  • Share this:
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే సొంత ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్న చపాక్ సినిమా ట్రైలర్ విడుదలైంది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘చపాక్’ చిత్రం. 2005లో ఢిల్లీలో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంది. సినిమాలో టైటిల్ పాత్రలో లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక కనిపించనుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు విక్రాంత్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన దీపిక, తన నటనకు ట్రైలర్ ఒక మచ్చుతునక అనే చెప్పవచ్చు. దేశంలో స్త్రీలపై జరుగుతున్న దాడులను ప్రతిబింబిచేలా ఈ చిత్ర ఇతివృత్తం ఉంది. ‘లక్ష్మీ అగర్వాల్‌పై జరిగిన యాసిడ్ దాడినే ఈ సినిమాకు కథగా ఎంచుకోగా, ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు దీపిక పడిన శ్రమ ట్రైలర్ లో కనిపిస్తోంది. ‘2005లో ఢిల్లీలో ఓ బస్టాప్‌లో అందరూ చూస్తుండగానే లక్ష్మీ అగర్వాల్‌పై జరిగిన యాసిడ్ దాడి ఇప్పటికీ కంటతడి పెట్టిస్తుంది. ఆ పాత్రలో దీపిక నటన వెండితెరపై చూడాల్సిందే అని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>