దీపిక చేసిన పనికి అంతా షాక్...24 యాసిడ్ బాటిల్స్ కొని...

యాసిడ్ అమ్మకాల్లో జరుగుతున్న అవకతవకలపై నిజా నిజాలను దీపిక టీమ్ నిరూపించింది. సాధారణ మినరల్ వాటర్ బాటిల్ కొన్నంత తేలికగా యాసిడ్ బాటిల్ లభిస్తున్న వైనం చూసి ఆశ్చర్యపోయింది.

news18-telugu
Updated: January 16, 2020, 9:08 AM IST
దీపిక చేసిన పనికి అంతా షాక్...24 యాసిడ్ బాటిల్స్ కొని...
(Image: Instagram)
  • Share this:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే చపాక్ సినిమా ప్ర‌మోష‌న్స్‌ వినూత్న రీతిలో చేస్తోంది. ఇందులో భాగంగా దీపిక అండ్ టీమ్ ఓ స్ట్రింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. యాసిడ్ అమ్మకాల్లో జరుగుతున్న అవకతవకలపై నిజా నిజాలను నిరూపించింది. సాధారణ మినరల్ వాటర్ బాటిల్ కొన్నంత తేలికగా యాసిడ్ బాటిల్ లభిస్తున్న వైనం చూసి ఆశ్చర్యపోయింది. సాధార‌ణంగా యాసిడ్‌ కొనాలంటే కొనుగోలు చేసే వ్య‌క్తి గుర్తింపు కార్డు చూసి, అడ్ర‌స్ తీసుకోవాలి. కానీ షాపు య‌జ‌మానులు అలాంటి నిబంధ‌న‌లను పాటించడం లేదని దీపికా పదుకొనే టీమ్ ఒక సామాజిక ప్రయోగం ద్వారా నిరూపించింది. దీపిక తన టీమ్‌తో కలిసి మొత్తం 24 యాసిడ్ బాటిల్స్‌ను కొనుగోలు చేసింది.

సుప్రీం నిబంధ‌నలకు తూట్లు పొడుస్తున్న అమ్మకం దారుల నుంచి మొత్తం 24 యాసిడ్ బాటిల్స్ కొన్నామ‌ని దీపిక ఆశ‌ర్య‌పోయారు. దీపిక త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్ట్రింగ్ ఆప‌రేష‌న్ వీడియోను పోస్ట్ చేశారు.


 View this post on Instagram
 

Acid has corroded many lives, crushed many dreams, dashed many hopes and scarred many futures. #WontBuyWontSell #Chhapaak @vikrantmassey87 @meghnagulzar @atika.chohan @shankarehsaanloy #Gulzar @_kaproductions @mrigafilms @foxstarhindi


A post shared by Malti (@deepikapadukone) on
First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>