సినిమా ఇండస్ట్రీలో చాలామంది.. కాస్త మంచి అవకాశాలు వచ్చి నాలుగు డబ్బులు చేతికి రాగానే.. మంచి ఇల్లు మాత్రం ఖచ్చితంగా కొనుక్కుంటారు. హీరో హీరోయిన్లు మాత్రమే కాదు.. ఇతర నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ముందుగా సొంతింటినే ప్లాన్ చేశారు. ఇక ఎలాంటి వారి జీవితంలో అయినా సొంతిల్లు అనేది ఓ కల. అలాంటి కలను సాకారం చేసేందుకు ప్రతీ ఒకరు జీవితంలో ఎంతో కష్టపడుతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ యంగ్ కపుల్ అలాంటి కలను నిజం చేసుకుంది. ఈ జంట కాస్ట్లీ ఇంటిని కొనేసింది. పది , ఇరవై కాదు.. ఏకంగా వంద కోట్లకు పైగానే ఖర్చు చేసి ఓ ఫ్లాట్‌ను తమ సొంతం చేసుకుంది.
ఆ జంట వేరెవరో కాదు.. బాలీవుడ్ యువ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె. వీరిద్దరు కలిసి ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఇల్లు కొనేసుకున్నారు. బాంద్రాలోని సాగర్ రేషమ్ రెసిడెన్షియల్ టవర్‌లో ఫ్లాట్ ను రూ.119 కోట్లతో కొనుగోలు చేశారు. ఫ్లాట్ నుంచి చూస్తే ఒకవైపు సముద్రం కనిపిస్తుంటుంది. సీ వ్యూ అపార్ట్ మెంట్ కావడంతో భారీగా వెచ్చించారు. దేశం మొత్తం మీద ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ఇంత భారీ ధర పలకడం ఇదేనని తెలుస్తోంది.
అంతేకాదు.. దీపిక అపార్ట్ మెంట్ కు సమీపంలోనే షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఫ్లాట్లు కూడా ఉన్నాయి. సల్మాన్ కు చెందిన గెలాక్సీ అపార్ట్ మెంట్స్, షారూక్ ఖాన్ కు చెందిన మనత్ బంగ్లా మధ్య సాగర్ రేషమ్ రెసిడెన్షియల్ టవర్ ఉంది. రణవీర్ జంట కొనుగోలు చేసిన ఫ్లాట్ క్వాడ్రప్లెక్స్. అంటే ఒకే ఫ్లాట్ నాలుగు అంతస్తులుగా ఉంటుంది. 16, 17, 18, 19 అంతస్తుల్లో వీరి ఫ్లాట్ ఉంది. మొత్తం విస్తీర్ణం 11,266 చదరపు అడుగులు.
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. దీపికా పదుకొణె షారుఖ్ ఖాన్ పఠాన్‌లో నటించనుంది. నటి హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మరియు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ది ఇంటర్న్‌లో కూడా నటిస్తుంది. ఇక వీటితో పాటు, బిగ్ బి, ప్రభాస్‌లతో కలిసి నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కెలో కూడా దీపిక కనిపించనుంది. మరోవైపు, రణ్వీర్ సింగ్ చివరిగా మే 13న విడుదలైన జయేష్‌భాయ్ జోర్దార్ సినిమాలో కనిపించాడు. ఈ నటుడు రోహిత్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన సర్కస్‌తో పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్నాడు. మరోవైపు రణ్వీర్ అలియా భట్‌తో కలిసి కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమా షూటింగ్లో ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.