ముంబై ఎయిర్‌పోర్టులో దీపికా చేసిన పనికి.. వావ్ అంటున్న ఫ్యాన్స్

తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో దీపికా యాక్షన్‌ను చూసిన నెటిజన్లంతా ఆమెను పొగడకుండా ఉండలేకపోతున్నారు

news18-telugu
Updated: June 23, 2019, 9:19 AM IST
ముంబై ఎయిర్‌పోర్టులో దీపికా చేసిన పనికి.. వావ్ అంటున్న ఫ్యాన్స్
తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో దీపికా యాక్షన్‌ను చూసిన నెటిజన్లంతా ఆమెను పొగడకుండా ఉండలేకపోతున్నారు
  • Share this:
దీపికా పదుకొనె... ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. సినిమాలు చేయడంలో... సినిమా స్టోరీలు ఎంచుకోవడంలో ఎంత విభిన్నంగా దీపికా ఆలోచిస్తుందో... రియల్ లైఫ్‌లో కూడా దీపికా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. చాలా సింపుల్ లైఫ్‌ను లీడ్ చేస్తూ...అందరికీ ఆదర్శంగా కనిపిస్తోంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో దీపికా యాక్షన్‌ను చూసిన నెటిజన్లంతా ఆమెను పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ ఇవ్వగానే... అక్కడున్న సెక్యూరిటీ... ఐడీ కార్డు చూపించాలంటూ అడిగారు.

అయితే ఆమెతో పాటు ఉన్నవాళ్లు దీపికా పదుకొనె అంటూ ఐడీకార్డు చూపించకుండా ముందుకు వెళ్లిపోయారు. అయినా కూడా సెక్యూరిటీ షో యువర్ ఐడీ అంటూ డిమాండ్ చేశాడు. దీంతో డోర్ వరకు వెళ్లిన దీపికా ఆగి.. డు యూ వాంట్ ఇట్.. అంటూ.. ఆమె బ్యాగ్ నుంచి ఐడీకార్డు తీసి సెక్యూరిటీకి చూపించింది. ఏమాత్రం భద్రతా సిబ్బందిపై చికాకు పడక... చిర్రుబుర్రులాడక... దీపికా ఐడీని చూపించి... సెక్యూరిటీ ఓకే అనగానే ముందుకు వెళ్లిపోయింది.

ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపికా రూల్స్ పాటిస్తుందంటూ.. నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమె పాజిటివ్ యాటిడ్యూడ్‌కి హ్యాట్సాఫ్ అంటున్నారు. దీపికాతో పాటు.. తన డ్యూటీని పక్కాగా ఫాలో అయిన సెక్యూరిటీని కూడా అభినందిస్తున్నారు. ప్రస్తుతం దీపిక్ యాసిడ్ బాధితురాలి పాత్రలో ‘చప్పక్’ అనే చిత్రంలో నటిస్తోంది. దీపికా .. రణ్‌వీర్ పెళ్లి తర్వాత తీస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


 
Loading...View this post on Instagram
 

Thy shall always obey rules 👍 #deepikapadukone


A post shared by Viral Bhayani (@viralbhayani) on
First published: June 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...