దీపికా, రణ్‌వీర్ పెళ్లిలో ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలు

బాలీవుడ్ హాట్ జంట దీపికా, రణ్‌వీర్‌ల వివాహం ఈ బుధవారం ఇటలీలోని లేక్‌కోమోలో అంగ రంగ వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు వచ్చిన అతిథిలకు వెల్కం డ్రింక్‌గా బెంగళూరుకు చెందిన ఫిల్టర్ కాఫీ అందించినట్టు సమాచారం. ఈ కాఫీ తాగి అతిథిలు మైమరిపోయారట.

news18-telugu
Updated: November 15, 2018, 4:03 PM IST
దీపికా, రణ్‌వీర్ పెళ్లిలో ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలు
దీప్‌వీర్ పెళ్లిలో కాఫీ ఘుమ ఘుమలు
  • Share this:
బాలీవుడ్ హాట్ జంట దీపికా, రణ్‌వీర్‌ల వివాహం ఈ బుధవారం ఇటలీలోని లేక్‌కోమోలో అంగ రంగ వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే కదా. దీప్‌వీర్ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులైన దాదాపు 40 మంది హాజరైనారు. బాలీవుడ్ నుంచి ఎవరికి ఈ పెళ్లికి పిలుపందలేదు.

వీరి వివాహం దక్షిణాదిన కొంకణి పద్దతిలో చాలా సంప్రదాయ బద్దంగా జరిగింది. ఈ వేడుకలో దక్షిణాదికి చెందిన స్పెషల్ వంటకాలను వడ్డించారు. అంతేకాదు వచ్చిన అతిథిలకు వెల్కం డ్రింక్‌గా బెంగళూరుకు చెందిన ఫిల్టర్ కాఫీ అందించినట్టు సమాచారం. ఈ కాఫీ తాగి అతిథిలు మైమరిపోయారట.

ఈ రోజు వీళ్లిద్దరి వివాహం సింధీ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. ఆ తర్వాత ఈ నెల 21 బెంగళూరులో, 28న ముంబాయిలో వీరిద్దరి వివాహా రిసెప్షన్ జరగనుంది. ఈ వివాహా విందుకు సినీ, రాజకీయ వర్గాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకను కనులారా వీక్షించేందకు కోట్లాది అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 15, 2018, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading