హార్టీ వెల్‌కం : ముంబై వచ్చిన హాట్ కపుల్ దీపికా, రణవీర్

ఇటలీ, లేక్ కోమోలో ఒక్కటైన బాలీవుట్ జంట దీపికా పదుకొణె, రణవీర్ సింగ్‌కి ముంబైలో గ్రాండ్ వెల్‌కం లభించింది.

news18-telugu
Updated: November 18, 2018, 11:08 AM IST
హార్టీ వెల్‌కం : ముంబై వచ్చిన హాట్ కపుల్ దీపికా, రణవీర్
ముంబై ఎయిర్‌పోర్టులో దీపికా, రణవీర్
  • Share this:
దీపికా, రణవీర్ ముంబై ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే కెమెరాలకు పనిచెప్పారు ఫ్యాన్స్. ఎంతో ఆనందంగా ఫొటోలకు పోజులిచ్చింది కొత్త జంట.

రణవీర్ గోల్డెన్ కుర్తాలో మెరిసిపోతుంటే, దీపికా లాంగ్ గోల్డెన్ కుర్తా, ఇయర్ రింగ్స్, చోకెర్‌తో తళుక్కుమంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ వరుసపెట్టి షేరింగ్ చేస్తుండటంతో ఇవి వైరల్ అయిపోయాయి.ముంబై, బాంద్రాలోని రణవీర్ సింగ్ ఇంట్లో వీళ్లిద్దరూ గృహప్రవేశం చేయబోతున్నారు.View this post on Instagram


A post shared by Viral Bhayani (@viralbhayani) on

View this post on Instagram

#ranveersingh #deepikapadukone #DeepVeerKiShaadi @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on
ఇటలీలోని లేకో కోమో పట్టణంలో దీపికా, రణవీర్ వివాహం జరిగింది. నవంబర్ 14న కొంకణీ సంప్రదాయం ప్రకారం జరగ్గా, నవంబర్ 15న సింధి సంప్రదాయం ప్రకారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. మూడు రోజుల ఈ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా నిర్వహించుకున్నారు ఈ కపుల్. ఇక నవంబర్ 21న బెంగళూరులో తొలి రిసెప్షన్ జరగనుంది. ఆ తర్వాత ముంబైలో బాలీవుడ్ ఫ్రెండ్స్ కోసం నవంబర్ 28న రెండో రిసెప్షన్ జరగనుంది.
Published by: Santhosh Kumar S
First published: November 18, 2018, 11:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading