ఛపాక్ ఆడియో లాంచ్‌లో కన్నీటి పర్యంతమైన దీపికా...

దీపికా పదుకొనే...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: January 5, 2020, 9:20 AM IST
ఛపాక్ ఆడియో లాంచ్‌లో కన్నీటి పర్యంతమైన దీపికా...
Twitter
  • Share this:
దీపికా పదుకొనే...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతలా ఆమె తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ ఏర్పరుచుకున్నారు. ఆమె తాజాగా నటిస్తోన్న ప్రయోగాత్మక చిత్రం ఛపాక్. ఈ చిత్రంలో దీపికా యాసిడ్ దాడికి గురైన యువతిగా కనిపించనున్నారు. మహిళా డైరెక్టర్ మేఘనా గుల్జార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి స్పందన అందుకుంది. ఈనెల 10న ఛపాక్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో ఆడియో లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో దీపికతో పాటు యాసిడ్ భాదితురాలు లక్ష్మీ అగర్వాల్‌ కూడా పాల్గొన్నారు. కాగా కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ ఈ సినిమాలో ఓ పాట పాడుతుండగా స్టేజీపై ఉన్న లక్ష్మీ చాలా ఎమోషన్ అయి కన్నీరు పెట్టుకుంది. దీంతో పక్కనే ఉన్న దీపిక ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చింది. అంతేకాదు ఒకానొక సందర్భంలో దీపిక కూడా కన్నీటి పర్యంతమయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారాయి.

Twitter


అది అలా ఉంటే ఓ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాదానంగా దీపికా స్పందిస్తూ...'ఈ సినిమాకు వెచ్చించిన డబ్బుంతా నాదే. ఇది నా సినిమా అనుకొనే ఇంత డబ్బు పెట్టాను' అని చెప్పింది. ఏకే బ్యానర్‌లో దీపికా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత దీపికా నటిస్తున్న మరో చిత్రం 'మహాభారత'. ఈ చిత్రాన్ని కూడా దీపికానే నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఈమె ద్రౌపదిగా కనిపించనుంది. వీటితో పాటు రణవీర్‌ సింగ్‌ హీరోగా చేస్తున్న క్రికెట్ నేపథ్యంలో వస్తోన్న '83' కూడా దీపికా నిర్మిస్తోంది.

దీపికా అదిరిపోయే హాట్ పిక్స్..


First published: January 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు