Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిగా మారుతుంది. ఇక ఇందులో మోనిత.. కార్తీక్ ను పెళ్లి చేసుకోవడానికి రకరకాల గెటప్ లలో దర్శనమిస్తు అందర్నీ షాక్ కు గురిచేస్తుంది. ఇక ఆదిత్యను మోనితనే యాక్సిడెంట్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ విషయం కార్తీక్ కు చెప్పేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. ఇక దీప ఆదిత్య దగ్గరకి వెళ్లి పరమర్శిస్తుంది. ఇక పిల్లలు మొండితనం చేయడంతో కాసేపు వాళ్ళతో మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు కార్తీక్ హాస్పిటల్ లో మోనిత మాటలను గుర్తు చేసుకొని ఆలోచనలో పడతాడు. అంతలోనే కానిస్టేబుల్ వచ్చి డాక్టరమ్మ ఫోన్ చేసిందని ఇస్తాడు. కార్తీక్ మాట్లాడటానికి బయట పడగా ఆ కానిస్టేబుల్ బలవంతంగా ఇవ్వడంతో తప్పడం లేదు అనుకొని ఫోన్ తీసుకొని మాట్లాడుతాడు. ఇక మోనిత తన వెటకారపు మాటలతో కార్తీక్ ను రెచ్చగొడుతుంది. ఇక తనకు ఫోన్ చేయడానికి ఒక కారణం ఉంది అంటే ఉదయం 11 గంటల 50 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉందంటూ పంతులు చెప్పాడని లేదంటే నువ్వు జైలు కి నీవాళ్లు పైకి పోతారు అంటూ వార్నింగ్ ఇస్తుంది.
ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ కార్తీక్ ను బయటిపెడుతుంది. మరోవైపు దీప పిల్లల దగ్గర కూర్చొని కార్తీక్ మాటలను తలచుకుని.. డాక్టర్ బాబు వింతగా చేస్తున్నాడని.. మానసికంగా ఎందుకు కృంగి పోతున్నాడు అనుకుంటూ.. కడుపు నొప్పి తగ్గాక కూడా ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు అంటూ ఆలోచనలో పడుతుంది. డాక్టర్ రీనా నెంబర్ ఉంటే బాగుండేది అనుకుంటా.. రేపు ఈ విషయం గురించి రోషిణితో మాట్లాడాలని అనుకుంటుంది.సౌందర్య వచ్చి ఆనందరావుతో కార్తీక్ గురించి, ఆదిత్య గురించి మాట్లాడుతుంది. ఆదిత్యకు ఆక్సిడెంట్ అయిందని వెళ్లి చూసేస్తాను అనేసరికి ఆనందరావు వద్దు అని ఆపుడతాడు.
ఇది కూడా చదవండి:చెప్పినట్టుగానే కార్తీక్ కుటుంబంపై కుట్ర చేసిన మోనిత.. ఆదిత్యకు ఘోర రోడ్డు ప్రమాదం?
ఇక కార్తీక్ కు బెయిల్ దొరకడం కష్టం అని ఆనందరావు అంటాడు. దీప రోషిణి దగ్గరికి వెళ్లి డాక్టర్ బాబు ముద్దాయి కాదని అంటుంది. ఇక డాక్టర్ బాబు కడుపునొప్పి వచ్చిందని అది ఒకటే రోజు తగ్గిందని ఇన్ని రోజులు ఎందుకు ఉంచారని అడుగుతుంది. తన ప్రశ్నలతో రోషిణి ని బాగా మండిపోతుంది.మోనిత తాళిబొట్టు, ఆభరణాలు, చీరను చూసుకుంటూ మురిసిపోతుంది. మెడలో తాళిబొట్టు వేసుకొని తెగ సంతోషపడుతూ శ్రీమతి మోనిత అంటూ బాగా మురిసిపోతుంది.
తనకు పుట్టబోయే బేబీ పేరు ఆనంద్ అంటూ ఇదే నీ పేరు అని మామయ్య పేరు పెట్టి పిలుస్తాను అని నవ్వుకుంటుంది. రోషిణి రత్న సీతతో మోనిత బతికే ఉందని అంటున్నాడు నిజమేనా అన్నట్లు ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలకు రత్న సీత వణికిపోతుంది. కార్తీక్ మోనిత వచ్చిన రోజు సీసీ ఫుటేజీ ఏదని ప్రశ్నిస్తుంది. ఆరోజు సీసీ ఫుటేజీ సర్వీస్ కోసం తీసేశారని టెన్షన్ పడుతూ చెబుతుంది రత్న సీత. తరువాయి భాగంలో డాక్టర్ ఫోన్ చేసిందని కార్తీక్ కు కానిస్టేబుల్ ఫోన్ ఇవ్వడంతో అక్కడ నుంచి బయటికి వెళ్లిన దీప డాక్టర్ బయటే ఉంది అంటూ మళ్లీ ఎందుకు ఫోన్ చేసిందని చూసేసరికి అద్దంలో మోనిత రూపం కనిపిస్తుంది. వెంటనే మోనిత దగ్గరికి వెళ్లి సీరియస్ గా చూస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Archana ananth, Doctor babu, Hima, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Sourya, Vantalakka