DEEPA FEELS SOMETHING FISHY ABOUT MONITHA WHEN KARTHIK REVEALS ABOUT HER PLAN IN TODAYS KARTHIKA DEEPAM SERIAL NR
Karthika Deepam: షాకింగ్ ట్విస్ట్.. నాకు భర్తగా నువ్వు ఫిక్స్ కార్తీక్ అంటున్న మోనిత.. రేపే పెళ్లి!
Karthika Deepam
Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ ను వదలట్లేదు. ఎంతో ఆసక్తిగా ఉన్న ఈ సీరియల్ మరింత ట్విస్టులతో దూసుకుపోతుంది.
Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ ను వదలట్లేదు. ఎంతో ఆసక్తిగా ఉన్న ఈ సీరియల్ మరింత ట్విస్టులతో దూసుకుపోతుంది. ఇక మోనిత.. భారతిని తన ఇంటికి పిలిపించి చీర పళ్ళు తెచ్చి చేతిలో పెడుతుంది. ఏంటని భారతి ప్రశ్నించగా.. దీపని క్షేమంగా ఇంటికి పంపించావ్ కాబట్టి ఈ చిరు కానుక అంటుంది. భారతి వద్దన్న వినిపించకుండా బలవంతం చేస్తుంది మోనిత. కానీ మోనిత ఇలా ఇవ్వడానికి కారణం కార్తీక్ కుటుంబం లో మళ్లీ అనుమానాలు కలిగించడానికి చేస్తూ ఈ ప్లాన్ చేసింది. ఇక దీప కార్తీక్ చెప్పబోయే విషయం గురించి ఏంటా అని సౌందర్య తో మాట్లాడుతుండగా అంతలోనే కార్తీక్ వచ్చి మోనిత.. భారతీ కి ఇచ్చిన కానుక గురించి తెలుపుతాడు.
బాలు దీప కోలుకున్న ఆనందంలో నిన్ను పట్టించుకోని ఉండరు అంటూ వాళ్ల తరఫున నేను ఈ కానుక ఇస్తున్నానని అన్నదంట అని చెబుతాడు కార్తీక్. ఈ విషయం గురించి పాపం పిచ్చిది అంటాడు కార్తీక్. ఇక సౌందర్య, దీపలో ఆలోచన ఎదురవుతుంది. తను కానుక ఇవ్వడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తుంటారు. ఇక దీప చెప్పి చెప్ప బోయే విషయంలో మోనిత విషయం గురించేమో అని ఆలోచిస్తుంది. ఇక మోనిత వీళ్ళకి విషయం తెలియవచ్చు అనుకుంటూ తెగ సంతోష పడుతుంది. కార్తీక్ ఇంట్లో అడుగు పెట్టడానికి మంచి ముహూర్తం కోసం పంతులు కి ఫోన్ చేస్తుంది. ఇక తను వేసే ప్లాన్ గురించి తెగ ఆలోచిస్తుంది.
ఇక కార్తీక్ తో దీప రేపు చెప్పబోయే విషయం గురించి ప్రశ్నిస్తుంది. కానీ కార్తీక్ మాత్రం పూజ సమయం లోనే చెప్పాలనుకుంటాడు. ఏ విషయం గురించి దీపా ప్రశ్నించడంతో..తన జీవితానికి ముడిపడిన విషయం అంటాడు. ఇక దీప ఆ విషయం చెప్పమని రిక్వెస్ట్ చేస్తూ ఏంటో తెలుసుకోవాలని ఉంది అంటూ అడుగుతుంది. కానీ కార్తీక్ అందరి ముందు చెప్పాలని డిసైడ్అవుతాడు. ఇక సౌందర్య పిల్లలని తీసుకొని రమ్మని కార్తీక్ ని కోరగా వెంటనే కార్తీక్ ఇప్పుడు కోసం మమ్మీ రేపు నేను చెప్పబోయే విషయం లో కూడదుఅంటాడు. ఇక మోనిత.. దీప, కార్తీక్ మదిలో పడి పోయింది అనుకుంటుందని.. రేపటితో కార్తీక్ తన భర్త కాదు.. తనకు భర్తగా కాబోతున్నాడని ఎన్ని సంవత్సరాల కల రేపటితో నెరవేరుతుందని తెగ సంతోష పడుతుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.