Karthika Deepam: మోనిత ముందే కార్తీక్, దీపల రొమాంటిక్ సీన్.. ఏకంగా తాంబూలం తినిపించుకుంటూ అబ్బో!

Karthika deepam

Karthika Deepam: బుల్లితెర లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా దీప డైలాగులు, తన ధైర్యం చూస్తుంటే మాత్రం కార్తీక్ కు న్యాయం చేసేలా కనిపిస్తుంది.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెర లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా దీప డైలాగులు, తన ధైర్యం చూస్తుంటే మాత్రం కార్తీక్ కు న్యాయం చేసేలా కనిపిస్తుంది. ఇక రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే మోనిత, దీప రోషిణి ఇంటికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ రోషిణి దీపను పిలవలేదు అన్న సంగతి తెలుసుకున్న మోనిత కోపంతో రగిలిపోతుంది. రోషిణి మాత్రం అంజి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే మోనిత మాత్రం గట్టిగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అంతలోనే నాది, అంజి ఫోన్స్ ఎందుకు పగలగొట్టావ్.. మేము కలిస్తే ఎందుకు వణికిపోయే దానివి అని మోనితను దీప ప్రశ్నిస్తూ.. నీ స్థాయి ఏంటి వాడి స్థాయి ఏంటి.. వాడితో నువ్వు రోడ్డు మీద మాట్లాడితే బాగోదు అని హెచ్చరిస్తే ఇలా చెబుతావా అని దీప అంటుంది.

    అంతలోనే దీపకు నామీద ముందునుంచి ఇదే అభియోగం ఉందని.. కార్తీక్ ప్రేమించిన హిమని చంపించానని.. చంపిన వాడే అంజి అని ఈ దీప చెబుతుంది. అదే కారులో హిమ పక్కన కార్తీక్ కూడా ఉన్నాడు కదా నేనెందుకు చంపాలనుకుంటాను అంటుంది మోనిత. ఇక రోషిణి.. హిమ చనిపోవడానికి ముందే కార్తీక్ ని ప్రేమించావా అని ప్రశ్నించగా అవును అని సమాధానం చెబుతుంది మోనిత. ఇక అక్కడి నుంచి మోనితను సరే అని చెప్పి పంపించగా.. న్యాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. రోషిణి కఠినంగా సమాధానం చెప్పడంతో వణుకుతూ వెళ్తుంది. ఇక దీప అంజి గురించి ఆచూకీ దొరికిందా మేడం అని ప్రశ్నించడంతో వెంటనే ఆ మాటలు విని అంజి గురించి దీప ఆడిన అబద్ధమని తెలుసుకొని.. షాక్ అవుతూ నీ అంతు చూస్తా అని వెళ్ళిపోతుంది.

    Karthika deepam

    ఇక భాగ్యం చపాతి ముద్దను మోనితలా ఊహించుకొని గట్టిగా కొడుతుంది. అంజి గురించి అబద్ధం అని తెలుసుకున్న మోనిత బిర్యానీ వండించుకుని తెగ సంబరపడిపోయింది. ఇక కార్తీక్ పిల్లలు, దీపతో కారులో ఇంటికి వస్తున్న సమయంలో మోనిత ఫోన్ చేస్తూ సంతోషంగా వెటకారం మాటలు మాట్లాడుతుంది. ఇక అదే కారులో పిల్లలకు పని ఉందని చెప్పి వాళ్ళను పంపించి మోనిత ఇంటికి బయలుదేరుతారు. ఇక మోనిత ఫోన్లోనే వాగుతూ ఉండగా.. ఎంట్రీ ఇస్తారు కార్తీక్ దీప. ఇక అది చూసి షాక్ అయిన మోనిత.. ధైర్యం తెచ్చుకుంటూ మాట్లాడుతుంది. ఇక దీప, కార్తీక్ మోనిత మాటలు విని నవ్వుకుంటారు. అంజి గురించి అబద్ధం అని తెలుసుకొని బిర్యాని సెలబ్రేషన్స్ చేసుకుంటుంది అని దీప అంటుంది. అంతేకాకుండా ఓ డైలాగుతో మోనితను ఆడుకుంటుంది. ఇక అక్కడే ఉన్న తాంబూలాన్ని తీసుకొని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండగా వారి మధ్య రొమాంటిక్ సీన్ ను చూసి మోనిత రగిలిపోతుంది. ఇదంతా విన్న ప్రియమణి అంజి ఎవరని.. అమ్మగారు ఎందుకు భయపడుతున్నారు అని అనుకుంటుంది.
    Published by:Navya Reddy
    First published: