Home /News /movies /

DEEPA AND KARTHIK ARE VERY SERIOUS ABOUT COOKING IN KATHIKA DEEPAM TELUGU SERIAL TODAY EPISODE NR

Karthika Deepam: రెచ్చిపోయిన దీప.. సహనం కోల్పోయిన కార్తీక్.. నలిగిపోతున్న సౌందర్య!

Karthika Deepam

Karthika Deepam

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్ ప్రతిరోజు దీపంలా వెలుగుతుంది

    Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్ ప్రతిరోజు దీపంలా వెలుగుతుంది. అంతేకాకుండా ఈ సీరియల్ అత్యధిక రేటింగ్ తో దూసుకుపోవడంతో మరింత ఆసక్తిగా మారింది. ఇక ప్రస్తుతం సరి కొత్తగా కాస్త ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు. మోనిత.. దీప అనారోగ్య సమస్య గురించి తెలుసుకోవడానికి భారతితో డిన్నర్ ప్లాన్ చేస్తుంది. ఇక మొత్తానికి దీప కండిషన్ సీరియస్ గా ఉండటం అని చెప్పిన డాక్టర్ భారతి.. ఆ తర్వాత మోనిత తో చేతులు కలిపినట్లు గా చూపించారు. అంతేకాకుండా భారతి..మోనిత ప్రేమ గురించి కాస్త సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.

    ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఆదిత్య దీప ఆరోగ్యం గురించి, తనతో ప్రవర్తించిన విధానాన్ని గురించి కార్తీక్ ను గట్టిగా నిలదీస్తాడు. దీంతో కార్తీక్.. దీప ఆరోగ్య సమస్య ఇంట్లో చెబితే ఏమవుతారోనని భయంతో.. తనను తాను కుమిలిపోతూ.. వారికి నిజం చెప్పడం కంటే అందరి ముందు చెడ్డవాడిగా మిగిలానని అనుకుంటాడు. ఇక మోనిత.. దీపం ఆరోగ్య సమస్య గురించి, కార్తీక్ మనసును గెలుచుకోవడానికి సమయం దగ్గరవుతుందని తనలో తాను మొత్తానికి సాధించినట్లు సంతోషపడుతుంది. ఇక దీప వంటగదిలో ఉంటూ సౌందర్యను, కార్తీక్ ని గమనిస్తూ ఉంటుంది.

    ఇక వారి దగ్గరికి కాఫీ తీసుకొస్తూ కార్తీక్ ను మధ్యాహ్నం లంచ్ గురించి అడుగుతుంది. ఇక మళ్లీ వంట గురించి మొదలుపెట్టినట్లు కార్తీక్ మాటలతో రెచ్చిపోతాడు. అంతేకాకుండా సౌందర్య కూడా దీపను మొండిపట్టు వద్దు అంటూ వాదిస్తుంది. కానీ దీప తగ్గకుండా మొండిపట్టు తోని.. ఆవేశం తో వచ్చే మాటలు మాట్లాడుతుంది. ఇక దీప మాటలకు కార్తీక్ భరించలేకపోతాడు. ఇక కార్తీక్.. ఈ విధంగా అంటూ ఇలాగే భరిస్తే మనల్ని బద్ధ శత్రువులుగా చూస్తుంది అంటూ.. ఆమె ఏం కోరుకుంటుందో, ఆశిస్తోందో అన్నట్లు అంటూ తాను మాత్రం పిల్లల కోసం ఇవన్నీ భరిస్తున్నా అంటూ.. అని దీప పై వేలు చూపిస్తూ మండిపడతాడు. ఇక ఈ మాటలకి దీప కోపంతో రియాక్షన్ అయ్యే విధానం తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Archana, Deepa, Karthik, Kathika deepam serial, Monitha, Nirupam paritala, Premi Vishwanath, Shoba shetty, Soundarya, Vantalakka

    తదుపరి వార్తలు