• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • DEBATE RUNNING ON SOCIAL MEDIA ABOUT NEPOTISM IN TOLLYWOOD PK

టాలీవుడ్‌లో నెపోటిజమ్‌ లేదా.. ఉదయ్ కిరణ్ చావుకు కారణం అది కాదా..?

ఉదయ్ కిరణ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (uday kiran sushant singh rajput)

Tollywood Nepotism: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాట నెపోటిజమ్.. అంటే బంధుప్రీతి అన్నమాట. తన వాళ్లకే అవకాశాలు ఇచ్చుకుంటూ బయటి వాళ్లను తొక్కేసే ప్రక్రియను..

  • Share this:
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాట నెపోటిజమ్.. అంటే బంధుప్రీతి అన్నమాట. తన వాళ్లకే అవకాశాలు ఇచ్చుకుంటూ బయటి వాళ్లను తొక్కేసే ప్రక్రియను నెపోటిజమ్ అని ముద్దుగా పిలుస్తుంటారు. బాలీవుడ్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుందిప్పుడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ లాంటి స్టార్ హీరో చనిపోయిన తర్వాత అందరూ దీనిపై ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్నలు వస్తున్నాయి. ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా మరోసారి టాలీవుడ్ నెపోటిజమ్ గురించి కూడా చర్చ మొదలైంది.

ఉదయ్ కిరణ్ ఫైల్ ఫోటో (Uday Kiran)
ఉదయ్ కిరణ్ ఫైల్ ఫోటో (Uday Kiran)


ఈయన చావుకు కారణం నెపోటిజమ్.. పెద్దవాళ్ల అహంకారం కాదా అంటూ అడుగుతున్నారు ఉదయ్ అభిమానులు. బంధుప్రీతి అనేది కేవలం బాలీవుడ్‌లో మాత్రమే ఉందా.. తెలుగు ఇండస్ట్రీలో లేదా..? నాని, విజయ్ దేవరకొండ లాంటి ఒకరిద్దరు హీరోలు మినహాయిస్తే ఇక్కడున్నదంతా వారసులే కదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ 10 హీరోలను తీసుకుంటే అందులో వారసులు కాకుండా బయటి వాళ్లు ఎవరున్నారు.. ఒక్క నాని తప్ప. విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.

నాని విజయ్ దేవరకొండ (Twitter/Photo)
నాని విజయ్ దేవరకొండ (Twitter/Photo)


వీళ్లు కాకుండా బయటి వాళ్లెవరొచ్చారు.. ఎక్కడ ఎదిగారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు బయటి నుంచి ఎవరైనా వచ్చినా కూడా అవకాశాలు రావాలి కదా.. మొత్తం కుటంబాలే ఇండస్ట్రీకి కబ్జా చేసిన తర్వాత బయటి వాళ్లకు ఆఫర్స్ ఎక్కడ్నుంచి వస్తాయి.. అన్నీ వాళ్ల కోసమే రాసుకుంటారు కదా అని విశ్లేషకులు కూడా అడుగుతున్న ప్రశ్న. ఎప్పుడో చిరంజీవి.. ఆ తర్వాత రవితేజ, శ్రీకాంత్.. ఈ మధ్య కాలంలో నాని, విజయ్ దేవరకొండ.. వీళ్లు కాకుండా తరతరాలుగా మన చరిత్ర అంతా వారసుల చేతుల్లోనే ఉంది కదా.. మరి ఇది కాదా నెపోటిజమ్ అంటూ ప్రశ్నలు వస్తున్నాయి సోషల్ మీడియాలో.

టాలీవుడ్ హీరోస్ (tollywood heroes)
టాలీవుడ్ హీరోస్ (tollywood heroes)


అప్పట్లో ఉదయ్ కిరణ్ లాంటి హీరో అనతి కాలంలోనే స్టార్‌గా ఎదుగుతుంటే కొన్ని శక్తులు కావాలనే అతడికి అవకాశాలు రాకుండా తొక్కేసిన మాట వాస్తవం కాదా.. అదే మాట దాసరి నారాయణరావు లాంటి వాళ్లు కూడా బయటికి చెప్పినపుడు ఈ నెపోటిజమ్ గురించి మాట్లాడే వాళ్లు ఎక్కడికి వెళ్లిపోయారు.. టాలీవుడ్‌లో ఉన్న నెపోకిడ్స్ మీకు కనిపించడం లేదా.. లేదంటే మాట్లాడే దమ్ము లేదా అంటూ నెటిజన్లు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వారసుల గురించి మాట్లాడాలంటే భయం అడ్డొస్తుందా.. ధైర్యం చేసి మాట్లాడితే అవకాశాలు తగ్గిపోయాయనే భయమా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తుంది.

టాలీవుడ్ హీరోస్ (tollywood heroes)
టాలీవుడ్ హీరోస్ (tollywood heroes)


అయితే నెపోటిజమ్ తప్పేం కాదని వర్మ లాంటి వాళ్లు కూడా వాదిస్తున్నారు. స్టార్ కిడ్స్ అయినంత మాత్రానా అందరూ స్టార్స్ అయిపోవడం లేదు కదా.. అల్లు అరవింద్ ఏమైనా బన్నీతో పాటు శిరీష్‌ను స్టార్‌గా చేయగలిగాడా.. అక్కడ మ్యాటర్ ఏంటంటే బన్నీ ప్రేక్షకులకు నచ్చాడు అంటూ వెనకేసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అనవసరంగా వారసత్వం అంటూ వాళ్లపై ఏడవడం మానేయండి అంటూ వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
First published: