హోమ్ /వార్తలు /సినిమా /

Amardeep - Ashu Reddy: సీరియల్ హీరో చనిపోయాడంటూ యూట్యూబ్ వీడియో.. మండిపడ్డ అషు రెడ్డి.. అతర్వాత జరిగింది ఇదే

Amardeep - Ashu Reddy: సీరియల్ హీరో చనిపోయాడంటూ యూట్యూబ్ వీడియో.. మండిపడ్డ అషు రెడ్డి.. అతర్వాత జరిగింది ఇదే

Amardeep - Ashu Reddy

Amardeep - Ashu Reddy

Amardeep - Ashu Reddy: సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో బాగా పాకింది. ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ క్షణాల్లో వైరల్ గా మారుస్తున్నారు. ఎక్కడో దూర ప్రాంతాలలో జరిగిన విషయాలు కూడా సులువుగా తెలిసిపోతుంది.

ఇంకా చదవండి ...

Amardeep - Ashu Reddy: సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో బాగా పాకింది. ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ క్షణాల్లో వైరల్ గా మారుస్తున్నారు. ఎక్కడో దూర ప్రాంతాలలో జరిగిన విషయాలు కూడా సులువుగా తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియాలో యూట్యూబ్ మాధ్యమం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎంతోమంది తమ పేర్ల మీద ఛానెల్స్ క్రియేట్ చేసుకొని అందులో ఎన్నో రకాల విషయాలు పంచుకుంటున్నారు.

ఇక కొందరు వ్యూస్ కోసం లేని పుకార్లను సృష్టించి వాటిని వైరల్ గా మారుస్తారు. ఆ పుకార్లు కూడా ఏవో చిన్న చిన్న విషయాలను కాకుండా ఏకంగా బతికున్న మనిషిని చనిపోయాడు అంటూ, సెలబ్రేటీ జంటలు విడిపోయారు అంటూ ఇలా చాలావరకు సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలను ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వైరల్ గా మారుస్తారు. అది ఇప్పటి నుంచే కాదు ఎప్పటినుండో ఇలాంటి ఫేక్ న్యూస్ లను క్రియేట్ చేసి ఏకంగా వాళ్లను మీడియా ముందుకు వచ్చేలా చేస్తారు. ఇదిలా ఉంటే తాజాగా మరో బుల్లితెర నటుడుని కూడా చనిపోయాడు అంటూ ఫేక్ న్యూస్ సృష్టించారు.

ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు.. ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ తో రామచంద్ర పాత్రలో మంచి అభిమానం సంపాదించుకున్న హీరో అమర్ దీప్. ఈ సీరియల్ కంటే ముందు ఉయ్యాల జంపాల, సిరిసిరిమువ్వలు వంటి పలు సీరియల్స్ లలో నటించాడు. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు. ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు. ఇదిలా ఉంటే ఈయనను ఏకంగా ఓ యూట్యూబ్ ఛానల్ బతికుండగానే చంపేసింది.

ఇది కూడా చదవండి:ఒకే రోజు కొత్త కార్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీలు దేవి నాగవల్లి, అరియనా.. కార్ల ధర ఎంతంటే?

ఇటీవలే మిధున్ టాకీస్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం కక్కుర్తితో బాగా దిగజారింది. ఇందులో దారుణంగా కన్నుమూసిన సీరియల్ నటుడు అమర్ దీప్ అంటూ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఆయన ఫోటోతో పాటు.. హాస్పిటల్ లో ఉన్న మరో ఫేక్ ఫోటోని యాడ్ ను తంబ్ నెయిల్ పెట్టి మరీ వీడియోను అప్ లోడ్ చేశారు ఆ ఛానల్ వాళ్లు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారగా నెటిజన్లు చూసి షాక్ అయ్యారు.

ఇది కూడా చదవండి:అర్ధరాత్రి బాత్రూమ్‌లో లహరీ నువ్వు కౌగిలించుకోలేదా రవి.. ప్రియా ఆంటీ డర్టీ టాక్.. నెటిజన్స్ ట్రోల్

దీంతో ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన ఈ ఛానల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు సెలబ్రెటీలు గట్టిగా స్పందించారు. ఇక మరో బుల్లితెర నటి అషు రెడ్డి కూడా తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆ యూట్యూబ్ ఛానల్ పై ఫైర్ అయ్యింది. అంతేకాకుండా ఆ వీడియో స్క్రీన్ షాట్ లు తీసి ఈ ఛానల్ పై రిపోర్ట్ చేయాలి అంటూ బాగా ఫైర్ అయ్యింది.

First published:

Tags: Amardeep, Ashu reddy, Janaki kalaganaledhu, Star Maa

ఉత్తమ కథలు