ఆస్కార్ ఎంట్రీలో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా..

వ్రతం చెడినా ఫలితం దక్కింది అంటారు కదా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఈయన హీరోగా నటించిన ఈ సినిమా ఆ మధ్య విడుదలైంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 21, 2019, 5:26 PM IST
ఆస్కార్ ఎంట్రీలో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా..
డియర్ కామ్రేడ్ పోస్టర్ (Source: Twitter)
  • Share this:
వ్రతం చెడినా ఫలితం దక్కింది అంటారు కదా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఈయన హీరోగా నటించిన ఈ సినిమా ఆ మధ్య విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్‌ ఊహించని విధంగా డిజాస్టర్ అయిపోయింది. నాలుగు భాషల్లోనూ దారుణంగా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండకు పెద్ద షాక్. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. అంతా మరిచిపోయి కొత్త సినిమాతో బిజీ అవుతున్న సమయంలో డియర్ కామ్రేడ్ సినిమా ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది.
Dear Comrade movie under consideration for Oscar entry from India along with another 28 movies pk వ్రతం చెడినా ఫలితం దక్కింది అంటారు కదా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఈయన హీరోగా నటించిన ఈ సినిమా ఆ మధ్య విడుదలైంది. Dear Comrade,Dear Comrade twitter,Dear Comrade oscar entry,Dear Comrade oscar consideration,dear comrade Oscar entry by Film Federation of India,telugu cinema,vijay devarakonda,rashmika mandanna,డియర్ కామ్రేడ్,డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ,డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న,ఆస్కార్ ఎంట్రీ నామినేషన్స్‌లో డియర్ కామ్రేడ్
డియర్ కామ్రేడ్‌లో రష్మిక, విజయ్ Photo: Instagram.com/thedeverakonda

దాంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ చిత్రంతో పాటు మరో 28 చిత్రాలు కూడా ఆహ్వానం అందుకున్నాయి. వీటన్నింటినీ స్క్రీనింగ్ చేసి అందులోంచి ఓ మంచి సినిమాను ఎంపిక చేసి ఆ చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్‌కి పంపుతారు. ఇదంతా ఇండియాలోనే జరుగుతుంది. తెలుగు నుంచి ఈ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక తెలుగు సినిమా డియర్ కామ్రేడ్‌. ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతుంది. త్వరలోనే ఇందులో మంచి సినిమా ఏదని ప్రకటించనున్నారు జ్యూరీ సభ్యులు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ అపర్ణ సేన్ అధ్యక్షతన ఈ జ్యూరీ పని చేస్తుంది.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు