సినిమా

  • associate partner

IPL 2020: ‘అల వైకుంఠపురములో’ అలా నడుస్తూ వస్తున్న డేవిడ్ వార్నర్..

IPL 2020: డేవిడ్ వార్నర్ ఏంటి.. అల వైకుంఠపురములో అలా నడుచుకుంటూ రావడం ఏంటి చిత్రం కాకపోతేనూ అనుకుంటున్నారా..? నమ్మకపోతే ఇక్కడ చూడండి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 8, 2020, 2:39 PM IST
IPL 2020: ‘అల వైకుంఠపురములో’ అలా నడుస్తూ వస్తున్న డేవిడ్ వార్నర్..
డేవిడ్ వార్నర్ (david warner)
  • Share this:
డేవిడ్ వార్నర్ ఏంటి.. అల వైకుంఠపురములో అలా నడుచుకుంటూ రావడం ఏంటి చిత్రం కాకపోతేనూ అనుకుంటున్నారా..? నమ్మకపోతే ఇక్కడ చూడండి.. చూసిన తర్వాత మీరే నమ్మక ఏం చేస్తారు..? అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్య కరోనా కారణంగా క్రికెట్ ఆడటం పూర్తిగా మానేసారు. దాంతో అప్పుడు ఐపిఎల్ కోసం హైదరాబాద్ వచ్చిన వార్నర్ కుటుంబంతో సహా ఇక్కడే ఉండి తెలుగు పాటలకు అదిరిపోయే డాన్సులు చేసాడు.. టిక్ టాక్ వీడియోలు దంచేసాడు.
డేవిడ్ వార్నర్ (TikTok/Instagram/Photo)
డేవిడ్ వార్నర్ (TikTok/Instagram/Photo)


గ్రౌండ్‌లో ఎలా అయితే బౌలర్స్‌ను ఉతికి ఆరేస్తాడో.. అచ్చంగా టిక్ టాక్‌లో కూడా ఊపేసాడు వార్నర్. అది బ్యాన్ అయిపోయింది కానీ లేదంటే మాత్రం కచ్చితంగా వార్నర్ దూకుడు చూసి ఏదో ఓ దర్శకుడు ఈయన్ని సినిమాల్లోకి తీసుకొచ్చేవాడే. అయితే ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమాలో వార్నర్ నటిస్తే ఎలా ఉంటుందో పోస్టర్ చేసి విడుదల చేసారు కొందరు అభిమానులు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమాలోని పాటలను టిక్ టాక్ చేసాడు వార్నర్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐపిఎల్ కోసం దుబాయ్ వెళ్లాయి అన్ని టీమ్స్. అక్కడే మరికొన్ని రోజుల్లో టోర్నమెంట్ మొదలు కానుంది. అల వైకుంఠపురములో పోస్టర్స్‌లో బన్నీ కోడిని పట్టుకొచ్చేది హైలైట్ అయింది.
అల వైకుంఠపురములో అల్లు అర్జున్ (Allu Arjun)
అల వైకుంఠపురములో అల్లు అర్జున్ (Allu Arjun)

తలపాగా కట్టుకుని అలా చుట్ట కాలుస్తూ నడుచుకుంటూ వచ్చే సీన్ అదిరిపోయింది. ఇప్పుడు ఈ పోస్టర్‌ను వార్నర్‌తో మార్ఫింగ్ చేసారు అభిమానులు. అల దుబాయ్‌లో అంటూ టైటిల్ కూడా పెట్టారు. ఇది చూసి వార్నర్ కూడా నవ్వుకున్నాడు. మీ అభిమానానికి థ్యాంక్ యూ అంటున్నాడు ఈయన. ఏదేమైనా కూడా వార్నర్ మరికొన్నాళ్లు ఇండియాలోనే ఉంటే హీరోలకు కాంపిటీషన్ అయిపోతాడేమో..?
Published by: Praveen Kumar Vadla
First published: August 8, 2020, 2:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading