డేవిడ్ వార్నర్ రచ్చ మాములుగా లేదుగా.. ఈ సారి మైండ్ బ్లాంక్ చేసాడుగా..

తాజాగా డేవిడ్ వార్నర్.. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని బాబు నువ్వు చెప్పు వాడిని కొట్టమను డప్పు అంటూ మైండ్ బ్లాంక్ సాంగ్‌కు టిక్‌టాక్ వీడియో చేశాడు.

news18-telugu
Updated: May 25, 2020, 1:44 PM IST
డేవిడ్ వార్నర్ రచ్చ మాములుగా లేదుగా.. ఈ సారి మైండ్ బ్లాంక్ చేసాడుగా..
మహేష్ బాబు పాటకు డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియో (Twitter/Photo)
  • Share this:
డేవిడ్ వార్నర్ ఇప్పట్లో తెలుగు సినిమాలను ఒదలేలా కనిపించడం లేదు. వారంలో ఒకటి మూడు సార్లైన తెలుగు హీరోల పాటలకు స్టెప్పులతో పాటు డైలాగ్స్‌కు టిక్‌టాక్ చేయకపోతే ఏమి తోచనట్టు కనిపిస్తోంది. తాజాగా డేవిడ్ వార్నర్.. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని బాబు నువ్వు చెప్పు వాడిని కొట్టమను డప్పు అంటూ మైండ్ బ్లాంక్ సాంగ్‌కు టిక్‌టాక్ వీడియో చేశాడు. ఈ వీడియోలో బ్యాటింగ్ చేస్తున్నట్టే చేస్తూ.. మాయమైపోతాడు. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా లోకల్ ’ సాంగ్‌ చేసి బర్త్ డే విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. అంతకు ముందు  బుట్టబొమ్మ అంటూ ఫ్యామిలీతో కలిసి డాన్సులు చేసాడు డేవిడ్. ఈయన చేసిన పాటకు అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయాడు. సూపర్ డేవిడ్ అంటూ అందరు ఆయన్ని పొగడ్తలో ముంచెత్తారు.ఆ తర్వాత కమల్ హాసన్ పాటకు కూడా స్టెప్పులేసాడు. ఆపై 14 ఏళ్ల క్రితం మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అంటూ అప్పట్లో పండుగాడు చెప్పిన మాటలనే ఇప్పుడు బ్యాటు పట్టుకుని డేవిడ్ చెప్పాడు. అంతేకాదు బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి అనే నేను డైలాగు చెప్పి అలరించాడు. ఆ తర్వాత ప్రభుదేవా ముక్కాాలా ముకాబులా సాంగ్‌కు డాన్స్ చేసి ఆశ్యర్యపరిచిన సంగతి తెలిసిందే కదా.
First published: May 25, 2020, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading