RRR: తారక్ గా కేన్.. చరణ్ గా వార్నర్.. జక్కన్నకు పోటీ ఇస్తున్న ఆసీస్ ఓపెనర్ క్రియేటివిటీ

జూనియర్ ఎన్టీఆర్ గా కేన్, రామ్ చరణ్ గా వార్నర్

సోషల్ మీడియాలో సిక్సర్లు కొడుతున్నాడు డేవిడ్ వార్నర్.. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడిగా ఇక్కడి అభిమానులకు కాస్త చేరువైన అతడు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ... తెలుగు ప్రజలకు అభిమాన ఆటగాడిగా మారిపోయాడు. తాజాగా ఆర్ ఆర్ ఆర్ స్టిల్ ను వార్నర్ మార్ఫింగ్ చేస్తే అది క్షణాల్లో వైరల్ అయ్యింది.

 • Share this:
  టాలీవుడ్ సెలబ్రిటీల కన్నా ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఎక్కువగా తెలుగు ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ తెలుగు ప్రజలకు అసలు పరిచయం అవసరం లేని పేరు. ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ అయిన.. హైదరాబాద్ సన్ రైజర్స్ తరపున ఆడడంతో ఇక్కడి ఫ్యాన్స్ అతడ్ని ఓన్ చేసుకుంటున్నారు. వారి చూపించే అభిమానంతో వార్నర్ కూడా టాలీవుడ్ ను తరచూ ఫాలో అవుతూ.. అభిమానులకు కావాల్సినంత వినోదం పంచుతున్నాడు. వార్నర్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. తెలుగు పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ, డైలాగులు చెప్తూ ఇటీవల సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అతడు షేర్ చేసే వీడియో క్లిప్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఎన్టీఆర్, రామ్ చరణ్ బైక్‌పై వెళ్తున్న ఫొటోను ‘ఆర్ఆర్ఆర్’ టీం విడుదల చేసింది. కొన్ని క్షణాల్లోనే ఆ ఫోటోను మార్ఫింగ్ చేసిన 34 ఏళ్ల వార్నర్.. బైక్ నడుపుతున్న ఎన్టీఆర్‌ తలకు బదులుగా తన సహచరుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ తలను తగిలించాడు. వెనక కూర్చున్న రామ్ చరణ్ తలకు బదులుగా తన ఫొటోను తగిలించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.

  ఈ పోస్టు చూసిన వెంటనే అభిమానులకు కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఫొటోపై ఎస్ఆర్‌హెచ్ సహచరుడైన రషీద్ ఖాన్ వెంటనే స్పందించాడు. ‘హెల్మెట్ గైస్’ అంటూ ట్రోల్ చేశాడు. వెంటనే స్పందించిన వార్నర్.. ‘నువ్వు కూడా రషీద్ భాయ్’ అని కామెంట్ చేశాడు.
  ఇదే ఫొటోకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా రషీద్ లానే స్పందించారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫొటోలకు హెల్మెట్లు పెట్టి ఇప్పుడు సంపూర్ణంగా ఉందని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్‌గా ఆర్ఆర్ఆర్ బృందం మరో ట్వీట్ చేస్తూ ఇది పరిపూర్ణంగా లేదని, నంబరు ప్లేట్ మిస్సయిందని గుర్తు చేసింది. మధ్యలో కల్పించుకున్న అభిమానులు ఆ బైక్‌కు హెడ్‌లైట్ కూడా లేదని సరదా కామెంట్లతో హోరెత్తించారు.

  డేవిడ్ వార్నర్ ఏం చేసినా సంచలనమే.. అతడు బ్యాట్‌ పట్టి మైదానంలో అడుగుపెడితే బౌండరీలు చిన్నబోతాయి.. కెమెరా ముందుకు వస్తే సోషల్‌ మీడియాలో లైకులతో హోరెత్తాల్సిందే.. ఆసీస్‌ ఆటగాడిగానైనా.. సనరైజర్ ఓపెనర్ గా అయినా.. మైదానంలో ఉంటే పరుగుల వరద పారాల్సిందే.. తాజాగో మరో సంచలన పోస్టుతో హాట్ టాపిక్ గా మారాడు వార్నర్. యాస్‌ యూజ్యువల్‌గానే ఈ పోస్ట్‌కు కూడా విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. క్షణల్లో వేల సంఖ్యలో లైకులు వచ్చిపడ్డాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులైతే కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు.
  Published by:Nagesh Paina
  First published: