హోమ్ /వార్తలు /సినిమా /

బన్ని, మహేష్, ప్రభాస్ అయిపోయారు.. తాజాగా డేవిడ్ వార్నర్ ఎవరిలా చేసాడంటే..

బన్ని, మహేష్, ప్రభాస్ అయిపోయారు.. తాజాగా డేవిడ్ వార్నర్ ఎవరిలా చేసాడంటే..

డేవిడ్ వార్నర్ డ్యాన్స్ (TikTok/Photo)

డేవిడ్ వార్నర్ డ్యాన్స్ (TikTok/Photo)

ఆస్ట్రేలియా క్రికెటర్  డేవిడ్ వార్నర్‌కు లాక్‌డౌన్‌లో పూటకో పాటతో డాన్సులు చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఈయన ఎవరి పాటకు డాన్సులు చేసాడంటే..

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్‌డౌన్ కారణంగా అందరు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో రెగ్యులర్ వాళ్లు చేసే పనులు లేక బోర్ కొట్టి సోషల్ మీడియాలో అప్పటికే ట్రెండింగ్‌లో ఉన్న పాటలకు స్టెప్పులు వేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్  డేవిడ్ వార్నర్‌కు లాక్‌డౌన్‌లో పూటకో పాటతో డాన్సులు చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా మన దేశ సినిమాలపై.. అందులో తెలుగు చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ మధ్యే బుట్టబొమ్మ అంటూ ఫ్యామిలీతో కలిసి డాన్సులు చేసాడు డేవిడ్. ఈయన చేసిన పాటకు అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయాడు. సూపర్ డేవిడ్ అంటూ అందరు ఆయన్ని పొగడ్తలో ముంచెత్తారు. ఆ తర్వాత కమల్ హాసన్ పాటకు కూడా స్టెప్పులేసాడు. ఆపై 14 ఏళ్ల క్రితం మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అంటూ అప్పట్లో పండుగాడు చెప్పిన మాటలనే ఇప్పుడు బ్యాటు పట్టుకుని డేవిడ్ చెప్పాడు.

View this post on Instagram

Who was better @candywarner1 and I or @theshilpashetty 😂😂 #theoriginals @prabhudevaofficial


A post shared by David Warner (@davidwarner31) onదక్షిణాది ప్రేక్షకులు డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలకు ఫిదా అవుతున్నారు. పూరీ జగన్నాథ్ మాత్రం వార్నర్ నటనకు ప్లాట్ అయి తన సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేయాలని కోరాడు.దీనికి డేవిడ్ కూడా ప్రయత్నించాను సర్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత రాములో రాములో పాటకు డాన్సులు చేసి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసాడు. దీనికి అల్లు అర్జున్ కూడా డేవిడ్ వార్నర్ చేసిన వీడియోలను రీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. నిన్నటి నిన్న ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’లోని అమరేంద్ర బాహుబలి అనే నేను డైలాగు‌ చెప్పి ఆశ్యర్యపరిచాడు. తాజాగా ఈయన ప్రభుదేవా ఎవర్ గ్రీన్ పాట ముక్కాలా ముకాబులా  పాటకు స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేసాడు. డేవిడ్ వార్నర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

First published:

Tags: Allu Arjun, David Warner, Mahesh babu, Prabhas, Prabhu deva, Tollywood

ఉత్తమ కథలు