పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఆ హీరోతోనే ‘జనగణమన’ పాడిస్తాడా..

ఎన్టీఆర్‌తో చేసిన ’టెంపర్’  సినిమా తర్వాత సరైన  సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు గతేడాది  రామ్‌తో తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పూరీ జగన్నాథ్.. మరోసారి తన మనసులో  మాట బయటపెట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా ఏంటో బయటపెట్టాడు.

news18-telugu
Updated: June 23, 2020, 4:01 PM IST
పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఆ హీరోతోనే ‘జనగణమన’ పాడిస్తాడా..
పూరి జగన్నాథ్ (Puri Jagannadh)
  • Share this:
ఎన్టీఆర్‌తో చేసిన ’టెంపర్’  సినిమా తర్వాత సరైన  సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు గతేడాది  రామ్‌తో తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగ లేదు.ఇస్మార్ట్ శంకర్ గొప్ప కథేం కాదు.. మామూలు రెగ్యులర్ మాస్ మసాలా సినిమా అంతే. ఈ టైమ్‌లో సినిమాలేం లేవు కాబట్టి బ్లాక్ బస్టర్ అయింది అనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మాస్ సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి అదే శంకర్‌కు కలిసొచ్చింది. ఇప్పుడు ఈ హిట్‌తో బ్లాక్‌బస్టర్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చినా కూడా పూరీకి ఒరిగింది మాత్రం లేదు. పూరీ జగన్నాథ్ మాత్రం మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు చేస్తా అని చెబుతున్నాడు. కానీ ఆయా హీరోలు మాత్రం సడీ చప్పుడు మాత్రం చేయడం లేదు. తాజాగా ఈ రోజు పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన  సందర్భంగా దర్శకుడు  పూరీ జగన్నాథ్.. మరోసారి తన మనసులో  మాట బయటపెట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాను తెరకెక్కించడమే అని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోవడమే తన డ్రీమ్ అంటున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ అనే ప్యాన్ ఇండియా మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.


అప్పట్లో మహేష్ బాబుతో ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్’ సినిమాల తర్వాత ముచ్చటగా మూడో సినిమా ‘జనగణమన’ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. అప్పట్లో పూరీ జగన్నాథ్.. కూడా ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసాడు. కానీ మహేష్ బాబుకు మాత్రం ఈ సినిమా స్క్రిప్ట్ పై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయలేదు. దీంతో పూరీ జగన్నాథ్.. మహేష్ బాబుతో ‘జనగణమన’  పాడించలేకపోయాడు.

పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)
పూరీ జగన్నాథ్ మహేష్ బాబు (Mahesh Babu Puri jagannadh)
తాజాగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ  సినిమాకు కొన్ని మెరుగులు దిద్దాడు. ఈసారి పూర్తి స్క్రిప్ట్‌తో మహేష్ బాబును మెప్పించాలని చూస్తున్నాడు. మరి ఈసారైనా పూరీ జగన్నాథ్.. మహేష్‌తో ‘జనగణమన’  పాడిస్తాడా ? లేకపోతే.. వేరే హీరోతో ‘జనగణమన’  పాడిస్తాడా అనేది   అనేది చూడాలి.
First published: June 23, 2020, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading