Puri Jagannadh: ప్లాస్టిక్‌ను కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలంటూ పూరీ జగన్నాథ్ వీడియో..

Puri Jagannadh: ఇస్మార్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ డేరింగ్ దర్శకుల్లో ఈయన కూడా ఒకడు. గత కొన్ని రోజులుగా పలు విషయాలపై తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

news18-telugu
Updated: September 20, 2020, 8:39 PM IST
Puri Jagannadh: ప్లాస్టిక్‌ను కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలంటూ పూరీ జగన్నాథ్ వీడియో..
ప్లాస్టిక్ పై పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
  • Share this:
Puri Jagannadh: ఇస్మార్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ డేరింగ్ దర్శకుల్లో ఈయన కూడా ఒకడు. ఇంకా చెప్పాలంటే ఈయనే ఆ ఒక్కడు. వందల కోట్ల ఆస్తులు పోయినా మళ్లీ సంపాదించుకున్నాడు.. డ్రగ్స్ కేసు నెత్తిమీద పడినా లేచి నిలబడ్డాడు. ఏదైనా విషయం గురించి సూటిగా సుత్తి లేకుండా మాట్లాడాలంటే కూడా పూరీని మించిన దర్శకుడు లేడు. ఇప్పుడు షూటింగ్స్ కూడా లేకపోవడంతో తన యూ ట్యూబ్ ఛానెల్‌పై ఫోకస్ చేసాడు పూరీ. తాజాగా ఈ యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే సెక్స్ ‌తో పాటు పలు అంశాలపై తన వాయిస్‌ను వినిపించాడు పూరీ జగన్నాథ్. తాజాగా పూరీ జగన్నాథ్ ప్లాస్టిక్ పై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టాడు.

ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడం కాదు. దాన్ని రీ సైక్లింగ్ చేయడంతోపాటు రీ యూజ్ చేయడం నేర్చుకుంటే.. ఇది పెద్ద సమస్యే కాదన్నారు. ఈరోజు ప్లాస్టిక్ అనేది ప్రపంచంలో అతిపెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు. ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాలంటూ గగ్గోలు పెడుతున్నారు. కానీ 1960లో ప్లాస్టిక్‌ను కనుగొన్నపుడు అందరు సంబరపడిపోయారు. ప్లాస్టిక్ కనిపెట్టినవాడికి దండలు శాలువాలు కప్పి సత్కారం కూడా చేసారు. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చనే భావన అపుడు ఏర్పడింది. దాంతో చెట్లు కొట్టక్కర్లేదు. మరి ఇప్పుడేమె ప్లాస్టిక్‌ను తిట్టుకుంటున్నాము. మనమే ప్లాస్టిక్‌ను సరిగా వాడడం చేతగాక..  వాడిన తర్వాత ఎక్కడిక్కడ పడేయడం మూలానా పర్యావరణానికి ముప్పు వాటిల్లింది. ఇపుడు ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసి మనం పేపర్‌కి వెళ్లిపోతామా ? రోజూ ఎన్ని చెట్లు కొట్టాలి ? ఎక్కడి నుంచి వస్తాయ్ ? అంతేకాదు మన 90 శాతం వెధవలు జీవితంలో ఒక్క మొక్క కూడా లైఫ్‌లో నాటరు. వాళ్లే పేపర్ బ్యాగ్స్ కావాలంటూ నినాదాలు ఇస్తారంటూ పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 20, 2020, 8:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading