ఛార్మితో పూరీ కనెక్ట్స్.. ఆమెతో కొత్త ప్రయాణం..

హీరోయిన్ ఛార్మికి ఇంతకు ముందులాగా సినిమాలో హిరోయిన్ పాత్రలు రావడం లేదు. దీంతో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌‌తో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో వారి మధ్య స్నేహం కూడా ఎర్పడింది. దానికి సంకేతమే ఈ పూరీ కనెక్ట్స్.

news18-telugu
Updated: February 15, 2019, 4:27 AM IST
ఛార్మితో పూరీ కనెక్ట్స్.. ఆమెతో కొత్త ప్రయాణం..
పూరీ జగన్నాథ్ ఛార్మి కౌర్
  • Share this:
హీరోయిన్ ఛార్మికి ఇంతకు ముందులాగా సినిమాలో హిరోయిన్ పాత్రలు రావడం లేదు. దీంతో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌‌తో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఆమె పూరి డైరెక్షన్‌లో తనయుడు ఆకాష్ హీరోగా వచ్చిన 'మెహబూబా' సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ సినిమా కలిసిరాక.. ఆమె నష్టాల్నీ మూటగట్టుకుంది. అయితే తాజాగా..పూరి మరో సినిమా.. 'ఇస్మార్ట్ శంకర్' రామ్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో కూడా చార్మి పాలు పంచుకుంటోంది. పూరి కూడా నిర్మాణానికి సంబంధించిన అన్ని హక్కులకు ఛార్మికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే..ఒకేసారి.. దర్శకత్వం, నిర్మాణం చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి పూరి.. ఛార్మికి బాధ్యతలు మొత్తం అప్పగించేశాడట.

Charmi and Puri
Charmi and Puri


ఇంతకు ముందు పూరిని డబ్బు విషయంలో కొందరు మోసగించారు. ఆ విషయంలో గుణపాఠం నేర్చుకున్న పూరి.. బయటవాళ్లను నమ్మకుండా.. ఛార్మిని నమ్ముకున్నాడట. దీంతో.. ఛార్మి, పూరి నిర్మించే లేదా..దర్శకత్వం వహించే సినిమాలకు నిర్మాణ వ్యవహారాలతో పాటు నటీనటుల కాల్షీట్స్, ఇతర ప్రాజెక్ట్స్ చూసుకోవడం వంటి వాటిల్లో పూరికి సహాయంగా వుంటుందని టాక్.

Charmi and Puri
ఇస్మార్ట్ శంకర్  షూటింగ్‌లో పూరి, రామ్, ఛార్మి



దీపికా పదుకొనే లేటెస్ట్ హాట్ ఫోటోస్
Published by: Suresh Rachamalla
First published: February 15, 2019, 4:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading