హోమ్ /వార్తలు /సినిమా /

Dasari Arun Kumar : దాసరి రెండో కుమారుడు అరుణ్ పై అట్రాసిటీ కేసు..

Dasari Arun Kumar : దాసరి రెండో కుమారుడు అరుణ్ పై అట్రాసిటీ కేసు..

దాసరి రెండో కుమారుడిపై అట్రాసిటీ కేసు (File/Photo)

దాసరి రెండో కుమారుడిపై అట్రాసిటీ కేసు (File/Photo)

Dasari Arun Kumar : దాసరి రెండో కుమారుడు అరుణ్ కుమార్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే..

  Dasari Arun Kumar :  దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బతికి ఉన్నంత వరకు తెలుగు సినీ రంగానికి  పెద్దగా వ్యవహరించి ఎన్నో సమస్యలను  సామరస్య పూర్వకంగా పరిష్కరించారు. అలాంటి దాసరి గారు.. తన కుటుంబంలోని సమస్యలను పరిష్కరించకుండానే పై లోకానికి వెళ్లిపోయారు. ఆయన కన్నుమూసినప్పటి నుంచి దాసరి కుమారుల మధ్య ఆస్తి వివాదం నడుస్తూనే ఉంది. మధ్యలో మోహన్ బాబు మధ్యవర్తిగా వ్యవహరించి ఆస్తి వివాదాన్ని పరిష్కరించినట్టు కనిపించినా.. ఇంత వరకు దాసరి ఆస్తుల లెక్క తేలలేదు. మొన్నామ‌ధ్య ఓ సారి దాస‌రి పెద్ద కోడ‌లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ ఆస్తి కొట్టేసారంటూ మోహ‌న్ బాబుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా.

  ఇపుడు దాసరి మన మధ్య లేకపోయినా.. ఆస్తి వివాదాలతో ఆయన తనయులు తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా దాసరి నారాయణ రావు రెండో తనయుడు అరుణ్ కుమార్ పై  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది. నరసింహులు అనే వ్యక్తి దాసరి బతికి ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గర పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన పనికి డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో గత కొన్ని రోజులుగా దాసరి కుమారులతో ఈ డబ్బు విషయమై వివాదం నలుగుతోంది. ఈ నేపథ్యంలో అరుణ్ కుమార్..తనను డబ్బులు ఇస్తానని ఇంటికి పిలిపించినట్టు నరసింహులు చెప్పుకొచ్చారు. తీరా డబ్బులు ఇవ్వకపోగా.. తనకు కులం పేరుతో దూషించారని నరసింహులు రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పీఎస్‌లో కంప్లైంట్  చేయగా... పోలీసులు ఈ విషయమై దర్యాప్తు మొదలు పెట్టారు. రీసెంట్‌గా దాసరి ఇద్దరు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.  ఆర్ధిక పరమైన లావాదేవాల కారణంగా దాసరి తనయులు తనను బెదిరించినట్టు సోమేశ్వర్ అనే వ్యక్తి బంజార్ హిల్స్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా.

  ఇవి కూడా చదవండి..

  Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..


  Vanitha Vijaykumar : చిరంజీవి ఫ్యామిలీతో వనిత విజయకుమార్ అనుబంధం.. ఆలీతో సరదగా సంచలన వ్యాఖ్యలు..


  Bigg Boss 5 Telugu: కళ్ల ముందు భారీ రెమ్యునరేషన్ .. ఐనా బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసిన ఫేమస్ సింగర్, యాంకర్..


  Rashmika Mandanna: పూల తలపాగాతో రష్మిక మందన్న రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోస్..


  Tollywood Family Multistarers: టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్.. మెగా, నందమూరి ఫ్యామిలీ నుంచి అక్కినేని, దగ్గుబాటి వరకు..

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Dasari Arun Kumar, Dasari Narayana Rao, Tollywood

  ఉత్తమ కథలు