హోమ్ /వార్తలు /సినిమా /

Dasara Movie Review: ‘దసరా’ మూవీ రివ్యూ.. నాని హిట్టు అందుకున్నాడా.. !

Dasara Movie Review: ‘దసరా’ మూవీ రివ్యూ.. నాని హిట్టు అందుకున్నాడా.. !

 దసరా మూవీ రివ్యూ  (Dasara Twitter Review Photo : Twitter)

దసరా మూవీ రివ్యూ (Dasara Twitter Review Photo : Twitter)

Dasara Movie Review: నాని గత కొన్నేళ్లుగా సరైన సాలిడ్ హిట్ పడలేదు. శ్యామ్ సింగరాయ్ ఓ మోస్తరుగా నడిస్తే.. అంటే సుందరానికీ సినిమా నాని ఆశలపై నీళ్లు చల్లింది. ఈ టైమ్‌లో శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడితో తన కెరీర్‌లో పూర్తి మేకోవర్‌తో మాస్ ఓరియంటెడ్ మూవీ ‘దసరా’ మూవీతో పలకరించాడు. మరి ఈ మూవీతో నాని తాను కోరకున్న సాలిడ్ హిట్ అందుకుని అభిమానులకు శ్రీరామ నవమి రోజున దసరా పండగ చేసుకోనులా చేసాడా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : దసరా  (Dasara)

నటీనటులు : నాని, కీర్తి సురేష్, సాయి కుమార్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని,షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు..

ఎడిటర్: నవీన్ నూలి

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

సంగీతం: సంతోష్ నారాయణ్

నిర్మాత : సుధాకర్ చెరుకూరి

దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల

విడుదల తేది : 30/3/2023

నాని గత కొన్నేళ్లుగా సరైన సాలిడ్ హిట్ పడలేదు. శ్యామ్ సింగరాయ్ ఓ మోస్తరుగా నడిస్తే.. అంటే సుందరానికీ సినిమా నాని ఆశలపై నీళ్లు చల్లింది. ఈ టైమ్‌లో శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడితో తన కెరీర్‌లో పూర్తి మేకోవర్‌తో మాస్ ఓరియంటెడ్ మూవీ ‘దసరా’ మూవీతో పలకరించాడు. మరి ఈ మూవీతో నాని తాను కోరకున్న సాలిడ్ హిట్ అందుకుని అభిమానులకు శ్రీరామ నవమి రోజున దసరా పండగ చేసుకోనులా చేసాడా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..  

తెలంగాణలో సింగరేణి బొగ్గు కాలరీస్ దగ్గరలో ఉన్న గ్రామం వీరపల్లి. అక్కడ ప్రజల జీవినంలో మందు అనేది ఓ భాగం. ఆ గ్రామంలో సిల్క్ బార్ ఫేమస్. ఎవరు మందు తాగాలన్న అక్కడికి రావాల్సిందే. ఇక  1994లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. మద్య నిషేధం విధిస్తారు. దీంతో మద్యం లేక అక్కడ మగవాళ్లు అల్లాడుతారు. ఆ తర్వాత మద్య నిషేధం ఎత్తేసిన తర్వాత ఆ ఊర్లో ఉండే ఓ పెద్ద మనిషి.. ఎవరు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే వాళ్లే ఆ ఐదేళ్లు బార్ నడుపుకునేలా ఒప్పందం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఊర్లో ఉండే ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ధరణికో స్నేహితుడు సూరి (దీక్షిత్ శెట్టి) ఆ తర్వాత స్నేహితుడి కోసం తన ప్రేమను త్యాగం చేసి తన ప్రియురాలిని దోస్తుకు  ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత అనుకోని సంఘటన నేపథ్యంలో తన స్నేహితుడు సూరి చనిపోతాడు. ఇక సూరి చనిపోవడానికి కారణం ఎవరు.. ? అతనిపై ధరణి ఎలా పగ తీర్చుకున్నాడు. ఇక చిన్నప్పటి నుంచి తాను ప్రేమించిన ప్రియురాలిని ధరణి పెళ్లి చేసుకున్నాడా ? చివర్లో ఊరి కోసం ధరణి ఏం చేసాడనేదే దసరా మూవీ స్టోరీ.

కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే.. 

దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా విషయానికొస్తే.. దర్శకుడు తెలంగాణ ప్రజలు ఎంతో సంబురంగా చేసుకునే దసరా పండగ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాడు. ముఖ్యంగా దర్శకుడు తెలంగాణ కల్చర్ అంటే తాగుడు, తినుడు అన్నట్టు చూపించుడు అనేది కరెక్ట్‌గా అనిపించదు. పైగా హీరో పెద్ద తాగుబోతొని లెక్క చూపించడం.. ఇక తెలంగాణ ఓ సామెత చెప్పినట్టు మాంసం తిన్న అని తెలియడానికి మెడలో బొక్కలు వేసుకున్నట్టు.. ఇక్కడ హీరోను తాగుబోతుగా చూపించడం వరకు ఓకే. అతని మొలతాడుకు రెండు మూడు క్వార్టర్ సీసలు వేలాడాలే చూపిచండం కాస్త అతిగా అనిపిస్తోంది.

Sri Rama Navami 2023: ఎన్టీఆర్, రామ్ చరణ్ టాలీవుడ్ సినీ అయోధ్యలో రాముడు పేరున్న హీరోలు వీళ్లే..

 బొగ్గు బావుల దగ్గర ఉండటంతో అక్కడున్న వాళ్లు కాస్త నల్లగా ఉంటారు. అందుకే హీరోను  ఈ సినిమాను డీ గ్లామరైజ్డ్‌గా చూపించాడు. ఈ సినిమా టైటిల్ విషయానికొస్తే.. ఇంటర్వెల్ వరకు ఊర్లో గొడవలు, రాజకీయాలతో నడిపించి ఇంటర్వెల్ దగ్గర పెద్ద ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌లో ఏం జరుగుతుందనేది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిత్తించాడు. ముఖ్యంగా హీరోలు పని పాట లేకుండా ఆవారా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయనేది ఈ సినిమా స్టార్టింగ్‌లో బొగ్గు రైలు వెళుతుంటే హీరో తన దోస్తులతో కలిసి రైల్లో ఉన్న బొగ్గును దొంగతనం చేస్తుంటారు.

ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ఉండే దసరా పండగ ముందునాడు చేసే సద్దుల బతుకమ్మ.. ఇక్కడ కొంత మంది దసరా నాడే సద్దుల బతుకమ్మ ఆడుతూ ఉంటారు. ఆ కల్చర్‌‌ను కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇక్కడ ప్రజలు మాట్లాడుకునే భాష, యాసను కూడా పర్ఫెక్ట్‌గా తెరపై చూపించాడు. దసరా అంటే చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా రావణాసురుడి బొమ్మను దగ్ధం చేస్తుంటారు. ఇందులో కూడా హీరో, హీరోయిన్ల క్యారెక్టర్స్‌ను సీతా రాములుగా చూపెట్టాడు. విలన్‌ను రావణాసుడితో పోల్చాడు. మొత్తంగా క్లైమాక్స్‌లో రాముడు.. రావరణాసురిడిని సంహారం చేసినట్టు.. హీరో.. విలన్‌ను చంపుతాడు.

Sri Rama Navami 2023: ఎన్టీఆర్, బాలయ్య, ప్రభాస్ సహా వెండితెర పై శ్రీ రాముని పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు..

ముఖ్యంగా మొదటి భాగంలో కాస్త బోరింగ్‌గా అనిపించినా.. ఇంటర్వెల్.. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సీన్స్ శ్రీకాంత్ ఓదెలా అద్భుతంగా రాసుకోవడంతో అంతే ఇదిగా తెరపై ఆవిష్కరించాడు. సినిమాకు క్లైమాక్స్‌ను ప్రాణంగా నిలిచింది. హీరో అంత మందిని చంపడం అనేది లాజిక్‌ను పక్కనపెడితే.. క్లైమాక్స్‌లో విలన్స్‌ను చంపే సీన్స్‌లో ఎమోషన్ క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ ఆర్ఆర్ .. మ్యూజిక్ బాగున్నాయి. సత్యన్ సూర్యన్.. తెలంగాణ పల్లెలోని నేటివిటీని తన కెమెరాలో అద్భుతంగా తెరకెక్కించాడు. ఎడిటర్ ఫస్టాఫ్‌లో తన కత్తెరకు పదును పెడితే బాగుండేది.

నటీనటుల విషయానికొస్తే.. 

నాని.. ఈ సినిమాలో తెలంగాణ ప్రాంత యువకుడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. అక్కడక్కడ నాచురల్‌గా కాకుండా.. కాస్త అతి అనిపించినా.. ఓవరాల్‌గా బాగానే ఉంది. నాని సినిమా కెరీర్‌లో ధరణిగా అతని నటన హైలెట్‌ అని చెప్పాలి. ముఖ్యంగా తాగుబోతులు నిజంగానే ఇలా ఉంటారా అని తన పాత్రలో జీవించాడు. వెన్నెల పాత్రలో నటించిన కీర్తి సురేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక హీరో ఫ్రెండ్ పాత్ర సూర్యగా నటించిన దీక్షిత్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక విలన్‌గా నటించిన చాకో తన నటనతో హీరోయిజం ఎలివేట్ అయ్యేలా యాక్ట్ చేసాడు. ఇతర పాత్రల్లో నటించిన సాయి కుమార్, సముద్రఖని సహా ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్ 

నాని నటన

క్లైమాక్స్

రీ రికార్డింగ్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ ల్యాగ్

ఎడిటింగ్

స్లో నేరేషన్

చివరి మాట : ‘దసరా’ పర్వాలేదనిపించే ఎమోషన్ డ్రామా..

రేటింగ్ : 2.75/5

First published:

Tags: Dasara Movie, Dasara Movie Review, Keerthy Suresh, Nani, Telugu movies, Tollywood

ఉత్తమ కథలు