Darshana Banik: బెంగాల్ బ్యూటీ దర్శనా బానిక్... ఈ మధ్య తరచూ టాక్ ఆఫ్ ది బీ టౌన్ అవుతోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి... నటిగా గుర్తింపు పొందింది బ్యూటీ. బెంగాలీ, టాలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పుడూ మెరిసే ఈ సొగసరి... సినీ ప్రపంచంలో తన ప్రస్థానాన్ని ఎప్పుడో ప్రారంభించింది. వొడాఫోన్, కలర్స్, బోరోలిన్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్న ఈ అవర్ గ్లాస్ బాడీ బ్యూటీ... 27 ఏళ్ల వయసులోనూ ఫ్రెష్ లుక్‌తో కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా తన అప్‌డేట్స్ ఇచ్చే ఈ బ్యూటీ... ఆ మధ్య పంచదార వాడటం మానేసిన్లు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే... ఫ్రై ఫుడ్ కంటే... స్వీట్లు తినడం, రిఫైండ్ షుగర్ (చక్కెర) వాడటం ప్రమాదకరం అని చెప్పింది. పంచదార వాడటం మానేశాక... తనలో పాజిటివ్ మార్పులు వచ్చాయని చెప్పింది.
తాజాగా ఈ బ్యూటీ ఇండియాలో కరోనా పరిస్థితిని చిన్న వీడియోతో చెప్పేసింది. గతేడాది కరోనా ఉన్నప్పుడు ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో, జనవరిలో కరోనా వెళ్లిపోయాక ఎలా ఫీల్ అయ్యారో... ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అంతా... వీడియోతో చెప్పేసింది. చివరికి అందరూ మాస్క్ పెట్టుకోవాలనే సందేశం ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలోకి వెళ్తోంది. అది మీరూ చూడండి.
View this post on Instagram
చక్కటి బాడీ ఫిట్‌నెస్ ఉన్న హీరోయిన్‌గా దర్శనా బానిక్‌కి పేరుంది. ముఖ్యంగా ఇండియాలో అవర్ గ్లాస్ బ్యూటీతో ఉండే హీరోయిన్లు తక్కువే. అలాంటి వారి స్థానంలో ఈ అమ్మడు కూడా చేరింది. అందుకే బ్యూటీ సీక్రెట్స్‌గా దర్శనా ఏం చెప్పినా... ఆసక్తిగా తెలుసుకుంటారు ఫ్యాన్స్. ఒకప్పుడు స్వీట్లు, చాకొలెట్లు, ఐస్‌క్రీమ్‌లు బాగా లాగించేసిన... కోల్‌కతా సొగసరి... ఇప్పుడు మాత్రం ఫుడ్‌పై పూర్తి కంట్రోల్‌తో ఉంది. ప్రతి రోజూ బాడీ ఫిట్‌నెస్ పెంచుకుంటూ... వార్తల్లో నిలుస్తోంది.
View this post on Instagram
ఇది కూడా చదవండి: Sanjeeda Shaikh: నీ మొహంలా ఉన్నాయి... సంజీదా బ్యాక్‌లెస్ ఫొటోలపై ట్రోలింగ్
దర్శనా బానిక్ తాజాగా ఓ థ్రిల్లర్ సినిమాలో అంకుష్ సరసన నటించింది. సినిమా పేరు మృగయ. దీనికి షౌవిక్ భట్టాచార్య దర్శకత్వం చేశారు. దర్శనా అంకుష్‌తో కలిసి నటించడం ఇదే తొలిసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actress, Darshana banik, Tollywood actress