• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DARLING DIRECTOR EXUDES CONFIDENCE OVER RADHE SHYAM TEASER MHN

Prabhas - Radhe Shyam: ప్రామిస్‌ అంటున్న డార్లింగ్‌ డైరెక్టర్‌ .. 'రాధేశ్యామ్‌' టీజర్‌పై లేటెస్ట్‌ అప్‌డేట్

Prabhas - Radhe Shyam: ప్రామిస్‌ అంటున్న డార్లింగ్‌ డైరెక్టర్‌ .. 'రాధేశ్యామ్‌' టీజర్‌పై లేటెస్ట్‌ అప్‌డేట్

Darling director exudes confidence over Radhe Shyam teaser

Prabhas - Radhe Shyam: 'రాధేశ్యామ్‌' టీజర్‌ ఎప్పుడు ఉంటుందా? అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ హాట్‌ అప్‌డేట్‌ ఇచ్చేశాడు

  • Share this:
    బాబోయ్ నువ్ ఈ మాట చెప్పి ఎన్నేళ్ల‌యిందో తెలుసా?
    త‌ర్వాత మిలియ‌న్ న‌వ్వులు న‌వ్వుదువు గానీ... ముందు ఆ ముక్క చెప్పు!
    అవ‌త‌ల కేజీయ‌ఫ్ మేక‌ర్స్ ని చూడు... ప‌బ్లిసిటీ ఎలా చేయాలో తెలుసుద్ది
    18 రోజుల ముందే ట్రెండింగ్ మొద‌లైంద‌క్క‌డ‌
    ఇండియాలో బిగ్గెస్ట్ బ్యాంక‌బుల్ స్టార్‌ని చేతిలో పెట్టుకుని... నీ వేషాలేంటి?
    సినిమా బావుంటే జై రాధ‌న్నా అంటాం... లేకుంటే బెండ్ తీస్తాం..!..... ఏంటీ వ‌రుస‌గా సినిమా డైలాగుల్లా ఉన్నాయి అని అనుకుంటున్నారా? సినిమా డైలాగులు కాదండీ, సినిమా డైర‌క్ట‌ర్‌ని ఉద్దేశించి ఫ్యాన్స్ అన్న డైలాగులు. అటు కేజీయ‌ఫ్ సినిమా టీజ‌ర్ డేట్ అనౌన్స్ అయింది.

    రోజూ యూనిట్ నుంచి ఫ్యాన్స్ కోసం ఏ పేప‌ర్ క‌టింగో, ఫొటోనో రిలీజ్ అవుతూనే ఉంది. అటు వ‌కీల్ సాబ్ కూడా ప‌వ‌ర్ ఫ్యాన్స్ కోసం ఒక‌టో తేదీ గిఫ్ట్ అనౌన్స చేసేశాడు. ఎటూ ర‌న్నింగ్‌లో ఉండి సైలెంట్‌గా ఉన్న‌ది ఈ రాధేశ్యామ్ ఒక్క‌టే. అందుకే ఫ్యాన్స్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ని తెగ ఆడేసుకున్నారు. ఒక‌టి కాదు, రెండు కాదు, వ‌రుస‌గా పోస్టుల‌తో రాధాకృష్ణ‌కి చెమ‌ట‌లు ప‌ట్టించేస్తున్నారు. బ‌య‌టి ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఉంటే స‌రేన‌నుకోవ‌చ్చు. త‌న సొంత హీరో ఫ్యాన్స్ నుంచే ట్రోలింగ్ ఉండ‌ట‌మే రాధాకృష్ణ విష‌యంలో మ‌రీ ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం.



    అయినా చిరున‌వ్వుల‌నే చిందిస్తున్నారు రాధాకృష్ణ‌. త్వ‌ర‌లోనే డార్లింగ్ టీజ‌ర్ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తాన‌ని ట్వీట్ చేశారు రాధాకృష్ణ‌. "త్వరలోనే టీజర్‌ మీ ముందుకు వస్తుంది. మీ నిరీక్షణకు తగ్గ ఫలితం ఉంటుంది. ఇది సత్యం నన్ను నమ్మంది. టీజర్‌ విడుదలైన తర్వాత మీరు చిరునవ్వులు చిందిస్తారు" అంటూ రాధాకృష్ణ ట్వీట్‌ చేశాడు. మరి డైరెక్టర్‌ ఈ సంక్రాంతికి టీజర్‌తో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ను కూల్‌ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
    Published by:Anil
    First published: