సెక్స్ పాఠాలు నేర్పిస్తున్న పూరీ జగన్నాథ్.. కామసూత్రలో ఏముందంటే..

పూరీ జగన్నాథ్ (puri jagannadh)

Puri Jagannadh: ఇస్మార్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ డేరింగ్ దర్శకుల్లో ఈయన కూడా ఒకడు.

  • Share this:
ఇస్మార్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ డేరింగ్ దర్శకుల్లో ఈయన కూడా ఒకడు. ఇంకా చెప్పాలంటే ఈయనే ఆ ఒక్కడు. వందల కోట్ల ఆస్తులు పోయినా మళ్లీ సంపాదించుకన్నాడు.. డ్రగ్స్ కేసు నెత్తిమీద పడినా లేచి నిలబడ్డాడు. ఏదైనా విషయం గురించి సూటిగా సుత్తి లేకుండా మాట్లాడాలంటే కూడా పూరీని మించిన దర్శకుడు లేడు. ఇప్పుడు షూటింగ్స్ కూడా లేకపోవడంతో తన యూ ట్యూబ్ ఛానెల్‌పై ఫోకస్ చేసాడు పూరీ.
పూరీ జగన్నాథ్ (puri jagannadh)
పూరీ జగన్నాథ్ (puri jagannadh)

అందులో కొన్ని ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నాడు. తాజాగా సెక్స్ గురించి చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. మన పూర్వీకులు సూచించిన కామసూత్ర గురించి.. దాని గొప్పతనం గురించి పూస గుచ్చినట్లు చెప్పాడు పూరీ జగన్నాథ్. వాళ్లతో పోలిస్తే ఒక విధంగా మనం సెక్స్ చేయట్లేదంటూ తెలిపాడు. ఈ ప్రపంచానికి శృంగారం అంటే ఏమిటో తెలిపింది కామసూత్ర అని.. మన పూర్వీకులు చేయనిది అంటూ ఏం లేదని.. వాళ్లు చివరికి జంతువులతో కూడా సెక్స్ చేసారని చెప్పుకొచ్చాడు పూరీ.
పూరీ జగన్నాథ్ (puri jagannadh)
పూరీ జగన్నాథ్ (puri jagannadh)

కామసూత్ర నుంచి వీలైనంత జ్ఞానం అందుకొని ఆ తర్వాత శృంగారం చేయమని మన పూర్వీకుల అభిప్రాయం అని తెలిపాడు ఈ దర్శకుడు. కానీ మనం ఆ విషయం తెలుసుకునేలోపే చాలా యాంగిల్స్ మిస్ అయిపోయామని ఆలోచిస్తామని ఓపెన్ స్టేట్‌మెంట్స్ చేసాడు పూరీ. నిజానికి వాత్సాయనుడు ఏం చెప్పాడనేది ఎవరూ పట్టించుకోరని.. కామసూత్ర అనేది ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నాడు పూరీ జగన్నాథ్.
పూరీ జగన్నాథ్ (puri jagannadh)
పూరీ జగన్నాథ్ (puri jagannadh)

మన పూర్వీకులు చేయని యాంగిల్ లేదు.. వాళ్లు చేసిందంతా దేవాలయాలపై బొమ్మల రూపంలో ఉంటుందని చెప్పాడు ఈయన. కామవాంఛలు తీరిన తర్వాతే గుడిలోకి రావాలని.. అప్పుడే మోక్షం లభిస్తుందని ఆ బొమ్మలు మనకు చెప్తాయని చెప్పుకొచ్చాడు పూరీ జగన్నాథ్. వయసులో ఉన్నపుడే శృంగారంపై మోజు పోవాలని చెప్తున్నాడు ఈక్ష్న. అప్పుడే కెరీర్‌లో సక్సెస్ అవుతామంటున్నాడు పూరీ. బ్యాంకాక్ షూటింగ్ అనగానే ఫస్ట్ రెండు రోజులు రెచ్చిపోతారని.. ఆ తర్వాత సైలెంట్ అయిపోతారని చెప్పాడు పూరీ జగన్నాథ్.

కానీ మరో దేశానికి వెళ్లినప్పుడు వ్యభిచారం నేరం అంటే ఒక్కరికి కూడా నిద్ర పట్టదు. శృంగారం గురించి మాట్లాడితే ఇప్పటికీ మనం భయపడుతూనే ఉన్నామంటున్నాడు పూరీ. కానీ మన పూర్వీకులు ఎంతో మాట్లాడేసారనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు అంటున్నాడు ఈ దర్శకుడు. అందుకే ఎవరికి ఇక్కడ సరిగ్గా మోక్షం లభించడం లేదు.. మధ్యలోనే పోతారంటున్నాడు పూరీ. ధర్మార్ధ కామ డెత్ అంటూ డాషింగ్ డైరెక్టర్ క్లాస్ తీసుకున్నాడు. మొత్తానికి పూరీ జగన్నాథ్ సెక్స్ పాఠాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: