హోమ్ /వార్తలు /సినిమా /

రివ్యూ: దర్బార్.. రజినీకాంత్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్..

రివ్యూ: దర్బార్.. రజినీకాంత్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్..

మే 10 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. అన్నాత్తే సినిమాను నవంబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో కాస్త రిస్క్ అయినా పర్లేదని కోవిడ్ టైమ్ లోనూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

మే 10 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. అన్నాత్తే సినిమాను నవంబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో కాస్త రిస్క్ అయినా పర్లేదని కోవిడ్ టైమ్ లోనూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

రజినీకాంత్ సినిమాలకు తెలుగు, తమిళ తేడాలుండవు. అన్నిచోట్లా ఆయనకు అభిమానులుంటారు. ఇప్పుడు కూడా దర్బార్ అంటూ వచ్చేసాడు రజినీ. కాకపోతే కొన్నేళ్లుగా ఈయన సినిమాలకు పెద్దగా క్రేజ్ రావడం లేదు. మరిప్పుడైనా దర్బార్ సినిమాతో ఈయన హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం..

ఇంకా చదవండి ...

నటీనటులు: రజినీకాంత్, నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, యోగిబాబు తదితరులు

నిర్మాత: సుభాస్కరన్

మాటలు: శ్రీ రామకృష్ణ

సంగీతం: అనిరుధ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఏఆర్ మురుగదాస్

రజినీకాంత్ సినిమాలకు తెలుగు, తమిళ తేడాలుండవు. అన్నిచోట్లా ఆయనకు అభిమానులుంటారు. ఇప్పుడు కూడా దర్బార్ అంటూ వచ్చేసాడు రజినీ. కాకపోతే కొన్నేళ్లుగా ఈయన సినిమాలకు పెద్దగా క్రేజ్ రావడం లేదు. మరిప్పుడైనా దర్బార్ సినిమాతో ఈయన హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం..

కథ :

ఆదిత్య అరుణాచలం(రజినీకాంత్) ముంబై పోలీస్ కమీషనర్. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్.. తప్పు చేస్తే ఎన్‌కౌంటర్ చేస్తుంటాడు. ముంబైలో ఛార్జ్ తీసుకోగానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ కేస్ ఛేదిస్తాడు. అప్పుడే ముంబైలో జరుగుతున్న డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ గురించి తెలుసుకుని వాటిని అంతమొందించే పనిలో పడతాడు. ఆ క్రమంలోనే ప్రధాన విలన్ హరి చోప్రా (సునీల్ శెట్టి) గురించి తెలుసుకుంటాడు. 27 ఏళ్ల కింద 30 మంది పోలీసులను సజీవదహనం చేసి తప్పించుకుని విదేశాలకు పారిపోతాడు హరి. ఆయన్ని పట్టుకోడానికి స్కెచ్ వేస్తాడు ఆదిత్య. అయితే ఇదిలా జరుగుతుండగానే ఆదిత్య కూతురు వల్లి(నివేదా థామస్) చనిపోతుంది. ఆమె ఎలా చనిపోతుంది.. ఎవరు చంపేస్తారు.. మధ్యలోకి లిల్లి (నయనతార) ఎలా వచ్చింది.. అనేది అసలు కథ..

కథనం:

రజినీకాంత్ సినిమా అంటే స్టైల్‌కు పెద్దపీట వేస్తారు దర్శకులు. ఆయన ఇమేజ్ వాడుకుంటూ కథ రాసుకుంటారు. ఇప్పుడు మురుగదాస్ కూడా ఇదే చేసాడు. కాకపోతే దానికి ఆయన స్టైల్ కూడా జోడించాడు. దేశంలో చాలా చోట్ల హైలైట్ అవుతున్న డ్రగ్స్‌తో పాటు ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు మురుగదాస్. దానికి రజినీ ఇమేజ్ తోడైంది.. దాంతో దర్బార్ ఫస్టాఫ్ పరుగులు తీసింది. చాలా చోట్ల వింటేజ్ రజినీకాంత్ కనిపించాడు. తనకే సాధ్యమైన వాకింగ్.. స్టైల్.. డైలాగ్స్‌తో రప్ఫాడించాడు రజినీకాంత్. అవన్నీ అభిమానులకు పండగే.. మాస్ పోలీస్ ఆఫీసర్‌గా అభిమానులు రజినీ నుంచి ఏమైతే కోరుకుంటారో అన్నీ ఇందులో పొందు పరిచాడు మురుగదాస్. దాంతో పాటే తన మార్క్ కూడా పోకుండా మంచి కథ కూడా చెప్పే ప్రయత్నం చేసాడు. తెలిసిన కథ అయినా కూడా కథనంలో వేగం తగ్గకుండా చూసుకున్నాడు. స్క్రీన్ ప్లే బాగుండటంతో ఇంటర్వెల్ వరకు అదిరిపోయింది దర్బార్. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్. స్క్రీన్ ప్లే మ్యాజిక్‌‌తో ఆ సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించాడు మురుగదాస్. ఇక నయనతార, యోగిబాబు, రజినీ మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి.. కాకపోతే మనదగ్గర అవి వర్కవుట్ అవ్వడం అయితే కష్టమే. సెకండాఫ్ కూడా అలాగే ఉంటుందేమో అనుకుంటే నీరసించిపోయింది స్క్రీన్ ప్లే. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ రావడంతో కథలో వేగం తగ్గింది. రజినీ, నివేదా మధ్య సన్నివేశాలు కూడా బాగున్నాయి. తండ్రీ కూతుళ్లుగా ఇద్దరూ సరిపోయారు. ఇక ఫస్టాఫ్ ఉమెన్ ట్రాఫికింగ్ ట్రాకింగ్ సీన్.. సెకండాఫ్ మెట్రో ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అప్పటి వరకు ఒకలా ఉన్న కథ కూతురు మరణం తర్వాత నార్మల్ రివేంజ్ డ్రామాగా మారిపోయింది. రజినీ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి కానీ విలన్ మాత్రం తేలిపోయాడు. సునీల్ శెట్టి లాంటి యాక్టర్ ఉన్నా కూడా వాడుకోలేకపోయాడు మురుగదాస్. క్లైమాక్స్ కూడా చాలా ఈజీగా తేల్చేసినట్లు అనిపించింది. ఓవరాల్‌గా దర్బార్ రజినీ అభిమానులకు ఫుల్ మీల్స్..

నటీనటులు:

రజినీకాంత్ మరోసారి అదరగొట్టాడు.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రప్ఫాడించాడు. ముఖ్యంగా వన్ మ్యాన్ షోతో అలరించాడు. ఎనర్జిటిక్ కాప్‌గా కనిపించాడు. ఇక నయనతార కొన్ని సన్నివేశాల్లోనే కనిపించింది. నివేదా థామస్ మంచి స్కోర్ చేసింది. చాలా బాగా నటించింది. రజినీ కూతురుగా బాగా చేసింది. సునీల్ శెట్టి పేరుకు విలన్ అయినా కూడా బలమైన సన్నివేశాలు అయితే పడలేదు. యోగిబాబు కామెడీ పర్లేదు..

టెక్నికల్ టీం:

అనిరుధ్ సంగీతం బాగుంది. పాటలు అంతంతమాత్రంగానే ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సూపర్. ముంబై విజువల్స్ చాలా అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ పర్లేదు.. సెకండాఫ్ కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అయ్యాయి. ఇక దర్శకుడు మురుగదాస్ మరోసారి పక్కా మాస్ సినిమాతోనే వచ్చాడు. అయితే రజినీ ఇమేజ్‌పై ఎక్కువగా ఫోకస్ చేయడంతో అక్కడక్కడా కథ గాడి తప్పింది. కథనం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే దర్బార్ మరో లెవల్ సినిమా అయ్యుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా ఒక్కమాట:

ఇది రజినీకాంత్ దర్బార్.. అభిమానులకు మాత్రమే..

రేటింగ్: 2.75/5

First published:

Tags: Darbar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు