రజినీకాంత్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ దర్బార్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైంది. తెలుగులో పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా తమిళనాట మాత్రం ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతుంది. వీకెండ్ ముగిసేనాటికి 150 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని పోస్టర్స్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే విడుదలైన నాలుగు రోజుల్లోనే టీవీలో ప్రసారమైంది ఈ చిత్రం. లేదు లేదు అక్రమంగా పైరసీని ప్రసారం చేసారు.
దీంతో నిర్మాతలు షాకయ్యారు. మొదట కొందరు ఈ సినిమా HD ప్రింట్‌ను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఆ తర్వాత లింక్‌ను అందరికీ షేర్ చేయమని.. ఓ వాయిస్‌లో చెప్పారు. ఇదిలా ఉండగానే తమిళనాట శరణ్య టీవీ ఛానెల్ అక్రమంగా దర్బార్ సినిమా పైరసీ వెర్షన్‌ను మధురైలో జనవరి 12న ప్రసారం చేసింది. ఈ విషయం చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దృష్టికి వచ్చింది.
విషయం తెలుసుకున్న తర్వాత చాలా సీరియస్ అయిన లైకా సంస్థ.. వెంటనే ఆ టీవీ ఛానెల్‌పై కేసు నమోదు చేశారు. తమిళ చిత్ర పరిశ్రమకు నష్టం చేకూరుస్తున్న వాళ్లపై ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఈ ఛానెల్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Darbar, Telugu Cinema, Tollywood