Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: February 7, 2020, 8:01 AM IST
వాళ్ల కోసం ఈయన కూడా ఏదైనా చేస్తుంటాడు. ఎవరైనా అభిమాని కష్టంలో ఉంటే వెంటనే స్పందించి సాయం చేస్తుంటాడు సూపర్ స్టార్. తన వరకు రాకపోతే ఏం చేయలేడేమో కానీ ఒక్కసారి తన దృష్టికి వచ్చిందంటే మాత్రం కచ్చితంగా వాళ్లను ఆదుకుంటాడు రజినీ. అలా ఎన్నో సార్లు చేసి చూపించాడు కూడా.
టైమ్ బాగోలేనపుడు అరటి పండు తిన్నా కూడా పన్ను ఇరుగుద్ది అంటారు కదా. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ మధ్య ఈయన టైమ్ ఈ మధ్య అస్సలు బాగోలేదు. చేసిన సినిమాలన్నీ వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. కొన్ని సినిమాలతో బయ్యర్లు పూర్తిగా రోడ్డు మీదకు వచ్చేసారు కూడా. ఆ మధ్య లింగా, కాలా లాంటి సినిమాలు డిస్ట్రిబ్యూటర్లను దారుణంగా ముంచేసాయి. ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఈయన నటించిన దర్బార్ సినిమాకు కూడా ఇలాంటి తిప్పలే వచ్చాయి. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రంతో మరోసారి నష్టాల పాలయ్యారు బయ్యర్లు. దాంతో ఇప్పుడు వాళ్ళంతా రోడ్డున పడే పరిస్థితికి వచ్చేసారు.

దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)
యావరేజ్ టాక్ వచ్చిన సినిమా రజినీకాంత్ ఇమేజ్‌తో కచ్చితంగా ఆడుతుందనుకున్నారు కానీ మ్యాజిక్ రిపీట్ కాలేదు. మురుగదాస్ ఉన్నా కూడా దర్బార్ సినిమా ఫ్లాప్ లిస్టులోకే వెళ్లింది. ఈ చిత్రంతో నష్టపోయిన బయ్యర్లు రజినీకాంత్‌ను కలిసారు. తమ నష్టాలకు ఏదో ఓ మార్గం చూపించాలని.. లేదంటే తాము రోడ్డున పడాల్సి వస్తుందని వాళ్లు సూపర్ స్టార్‌కు విన్నవించుకోవాలనుకున్నారు కానీ కుదర్లేదు. వాళ్లకు అక్కడ పర్మిషన్ కూడా రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన దర్బార్.. కనీసం 100 కోట్లు షేర్ కూడా తీసుకురాలేదు. కేవలం తమిళనాడులోనే 64 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఇప్పటి వరకు వచ్చింది 37 కోట్లు మాత్రమే. దాంతో ఎటు చూసుకున్నా కూడా దర్బార్ సినిమా భారీగానే నష్టాలు తీసుకొచ్చింది.

దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)
మరోవైపు దర్బార్ సినిమా నష్టాలకు తనను బాధ్యుడిని చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నట్లు చెబుతున్నాడు దర్శకుడు మురుగదాస్. ఈ మేరకు ఆయన కూడా రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి హాని ఉందని.. రక్షణ కల్పించాలని కోర్టుకు విన్నవించాడు ఈ దర్శకుడు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసినా కూడా అంచనాలు అందుకోలేకపోయాడు మురుగదాస్. ఈ చిత్రంతో చాలా మంది బయ్యర్లు రోడ్డు మీదకు వచ్చేసారని తెలుస్తుంది. చెన్నైలోని రజినీ ఇంటికి వెళ్లాలని బయ్యర్లు ప్రయత్నించినా కూడా వాళ్లను పట్టించుకోలేదు సూపర్ స్టార్. దర్శకుడు మురుగదాస్‌ను కలవడానికి ప్రయత్నించినా ఇదే సీన్ రిపీట్ కావడంతో కోర్టుకు వెళ్ళారు బయ్యర్లు.

దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)
బయ్యర్లు ఇలా చేస్తుంటే.. ఈ వివాదంలో రజినీకాంత్‌తో పాటు మురుగదాస్‌ను సపోర్ట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. దర్బార్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలనే తెచ్చిపెట్టిందని వాళ్లు చెబుతున్నారు. ముఖ్యంగా లాభాలు రాకుంటే విడుదలైన నాలుగు రోజుల తర్వాత రజినీతో కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులెందుకు ఇచ్చారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగానే రజినీపై చెడు ప్రచారం చేస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కూడా రజినీ సినిమాకు ఇలాంటి ప్రచారాలు జరగడం మాత్రం నిజంగానే శోచనీయం.
Published by:
Praveen Kumar Vadla
First published:
February 7, 2020, 8:01 AM IST