రజినీకాంత్ సినిమా ఎలా ఉన్నా కూడా అది రజినీ సినిమా అంతే.. అభిమానులు తొలిరోజు పండగ చేసుకుంటారు. ఆయన్ని స్క్రీన్‌పై చూడ్డానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు దర్బార్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. సంక్రాంతి సీజన్‌ను తన సినిమాతోనే మొదలుపెట్టాడు ఈయన. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఊహించినట్లుగానే ఈ చిత్రం ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉన్నాయి. రజినీ మేనియా అన్నిచోట్లా కనిపించింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అక్కడ భారీ వసూళ్లపై కన్నేసాడు రజినీ.
పైగా సోలో తమిళ సినిమా కావడంతో పొంగల్‌కు రచ్చ చేయడం ఖాయంగా మారిపోయింది. తమిళనాట అయితే రజినీకి తిరుగులేదు.. అక్కడ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా తలైవా నువ్వు సూపర్ అంటున్నారు. మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతుంది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.
తమిళనాడులోనే 24 కోట్ల ఓపెనింగ్ తెచ్చుకుంది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో 4.40 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటక, కేరళలో కూడా మంచి వసూళ్లే తీసుకొచ్చింది దర్బార్. మొత్తానికి దర్బార్ ఫస్ట్ డే బాగానే కుమ్మేసింది. మరి మన సినిమాలు విడుదలైన తర్వాత దర్బార్ దూకుడు ఎలా ఉండబోతుందో.. ప్రస్తుతానికి తమిళనాట అయితే ఈ సినిమాకు తిరుగులేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Darbar, Rajinikanth, Telugu Cinema, Tollywood