No time to Die : విడుదల మళ్లీ వాయిదా.. సమ్మర్‌ను టార్గెట్ చేసిన బాండ్..

No time to Die : హలీవుడ్ సినిమాల్లో జేమ్స్ బాండ్ చిత్రాలకు వుండే క్రేజే వేరు. తరాలు మారుతున్న బాండ్ చిత్రాలను వీక్షించడంలో ప్రేక్షకుల అభిరుచిలో మాత్రం మార్పురావట్లేదు.

news18-telugu
Updated: October 4, 2020, 7:36 AM IST
No time to Die : విడుదల మళ్లీ వాయిదా.. సమ్మర్‌ను టార్గెట్ చేసిన బాండ్..
మళ్లీ వాయిదా పడ్డ బాండ్ సినిమా Photo : Twitter
  • Share this:
హలీవుడ్ సినిమాల్లో జేమ్స్ బాండ్ చిత్రాలకు వుండే క్రేజే వేరు. తరాలు మారినా జేమ్స్ బాండ్ చిత్రాలను వీక్షించడంలో ప్రేక్షకుల అభిరుచిలో మాత్రం మార్పురాలేదు. బాండ్ సినిమా వస్తోందంటే చాలు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు సినీ అభిమానులు. ఎన్ని హలీవుడ్ చిత్రాలు వచ్చిన వీటికి మాత్రం క్రేజ్ తగ్గట్లేదు. ఈ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే దశాబ్దాలుగా ఈ సీరీస్ లో సినిమాలు వస్తున్నా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా బాండ్ సీరీస్ లో వస్తున్న 25వ చిత్రమే 'నో టైమ్ టు డై'. ప్రస్తుతం ఈ జేమ్స్ బాండ్ చిత్రాల్లో హీరోగా ఇంగ్లీష్ నటుడు డేనియల్ క్రేగ్ నటిస్తున్నాడు. జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియ‌ల్ ఐదుసార్లు హీరోగా న‌టించాడు. ఈ సినిమా త‌ర్వాత జేమ్స్ బాండ్ సినిమాల‌కు ఆయ‌న గుడ్‌బై చెప్ప‌నున్నారు. ఈ లేటేస్ట్ చిత్రానికి క్యారీ జోజీ దర్శకత్వం వహించాడు. 'నో టైమ్ టు డై' సినిమాను తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించారు. ఇక ఈ సినిమా సమ్మర్‌లో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదాపడింది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ట్రైలర్ విడుద‌లై మంచి స్పందనను దక్కించుకుంది.

'నో టైమ్ టు డై' సినిమా నిర్మాణానికి 200 మిలియ‌న్ పౌండ్లు(దాదాపు 1837 కోట్ల రూపాయ‌లు) ఖ‌ర్చ‌ు అయ్యిందట. ఇక ఈ సినిమా క‌థ విష‌యానికొస్తే సీఐఏ సంస్థ జేమ్స్ బాండ్‌కు ఓ శాస్త్రవేత్తని రక్షించే మిషన్ అప్పగిస్తుంది. అయితే ఆ మిషన్‌‌ను పూర్తి చేసే క్రమంలో విల‌న్లు అడుగుడుగునా ఆటంకాలు సృష్టిస్తుంటారు. దాన్ని బాండ్ ఎలా ఎదుర్కొన్నార‌నేది కథ. అన్ని అనుకూలిస్తే నో టైమ్ టు డై నవంబర్‌లో విడుదలకావాల్సి ఉండేది. కానీ పరిస్థితులు అనుకూలించగా ఈ సినిమా విడుదల తేదీని మరోసారి వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఇయాన్ ప్రొడక్షన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
Published by: Suresh Rachamalla
First published: October 4, 2020, 7:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading