హోమ్ /వార్తలు /సినిమా /

No time to Die : నవంబర్‌‌ను టార్గెట్ చేసిన జేమ్స్ బాండ్..

No time to Die : నవంబర్‌‌ను టార్గెట్ చేసిన జేమ్స్ బాండ్..

నో టైమ్ టు డైలో డేనియల్ క్రేగ్ ట్రైలర్ విడుదల  Photo : Twitter

నో టైమ్ టు డైలో డేనియల్ క్రేగ్ ట్రైలర్ విడుదల Photo : Twitter

No time to Die : హలీవుడ్ సినిమాల్లో జేమ్స్ బాండ్ చిత్రాలకు వుండే క్రేజ్ వేరు. ఈ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

    హలీవుడ్ సినిమాల్లో జేమ్స్ బాండ్ చిత్రాలకు వుండే క్రేజ్ వేరు. ఈ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే దశాబ్దాలుగా ఈ సీరీస్ లో సినిమాలు వస్తున్నా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా బాండ్ సీరీస్ లో వస్తున్న 25వ చిత్రమే 'నో టైమ్ టు డై'. ప్రస్తుతం ఈ జేమ్స్ బాండ్ చిత్రాల్లో హీరోగా ఇంగ్లీష్ నటుడు డేనియల్ క్రేగ్ నటిస్తున్నాడు. జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియ‌ల్ ఐదుసార్లు హీరోగా న‌టించాడు. ఈ సినిమా త‌ర్వాత జేమ్స్ బాండ్ సినిమాల‌కు ఆయ‌న గుడ్‌బై చెప్ప‌నున్నారు. ఈ లేటేస్ట్ చిత్రానికి క్యారీ జోజీ దర్శకత్వం వహించాడు. 'నో టైమ్ టు డై' సినిమాను తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించారు. ఇక ఈ సినిమా సమ్మర్‌లో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదాపడింది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ట్రైలర్ విడుద‌లై మంచి స్పందనను దక్కించుకుంది.

    'నో టైమ్ టు డై' సినిమా నిర్మాణానికి 200 మిలియ‌న్ పౌండ్లు(దాదాపు 1837 కోట్ల రూపాయ‌లు) ఖ‌ర్చ‌ు అయ్యిందట. ఇక ఈ సినిమా క‌థ విష‌యానికొస్తే సీఐఏ సంస్థ జేమ్స్ బాండ్‌కు ఓ శాస్త్రవేత్తని రక్షించే మిషన్ అప్పగిస్తుంది. అయితే ఆ మిషన్‌‌ను పూర్తి చేసే క్రమంలో విల‌న్లు అడుగుడుగునా ఆటంకాలు సృష్టిస్తుంటారు. దాన్ని బాండ్ ఎలా ఎదుర్కొన్నార‌నేది కథ. అన్ని అనుకూలిస్తే నో టైమ్ టు డై నవంబర్‌లో విడుదలకానుంది.

    Published by:Suresh Rachamalla
    First published:

    ఉత్తమ కథలు