డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘కథ వెను కథ’ (Katha Venuka Katha). దందమూడి అవనీంద్ర కుమార్ నిర్మాతగా దండమూడి బాక్సాఫీస్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 24న భారీ ఎత్తున్న సినిమా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉండి యూనిట్.
సినిమా షూటింగ్ అంటే అందరికీ సరదా. నటీనటులు అయితే మనసు పెట్టి తమ యాక్టింగ్ స్కిల్స్‌ను చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సినిమా యూనిట్‌లో అనుకోకుండా ఐదుగురు యాక్టర్స్ మిస్ అయ్యారు. అందులో ముగ్గురు అమ్మాయిలు. వాళ్లేం అయ్యారో ఎవరికీ అంతు చిక్కదు. కానీ వరుస హత్యలు జరుగుతుంటాయి. అప్పుడేం జరిగింది.. పోలీసులు ఏం చేశారనేది తెలుసుకోవాలంటే ‘కథ వెనుక కథ’ సినిమా చూడాల్సిందే అంటున్నారు నిర్మాత దందమూడి అవనీంద్ర కుమార్.
ఇప్పటికే ‘కథ వెను కథ’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది వరకే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.
ట్రైలర్‌ను గమనిస్తే హీరో (విశ్వంత్ దుడ్డుంపూడి)కి డైరెక్టర్ కావాలనేది డ్రీమ్. మరో వైపు మరదలితో ప్రేమ. వీరి లవ్ విషయం తెలుసుకున్న హీరో మామయ్య సంవత్సరంలో హిట్ సినిమా తీసి డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంటేనే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని కండీషన్ పెడతాడు. హీరో తన కథతో ఎలాగో డైరెక్షన్ ఛాన్స్ సంపాదిస్తాడు. షూటింగ్ జరుగుతున్న సమయంలో యూనిట్ మెంబర్స్‌లో ఐదుగురు కనిపించరు. అందులో ముగ్గురు అమ్మాయిలే. అదీ కాకుండా వరుస హత్యలు జరుగుతుంటాయి. దీంతో పోలీసులు సత్య (సునీల్) అనే అధికారికి కేసుని అప్పగిస్తారు. సత్య ముందుగా హీరోనే అరెస్ట్ చేసి జైలు వేస్తాడు. అసలు జరుగుతున్న హత్యలకు, హీరోకి ఉన్న లింకేంటి? అనేది తెలుసుకోవాలంటే మార్చి 24 వరకు ఆగాల్సిందే. ట్రైలర్ రిలీజ్ తర్వాత కథ వెనుక కథపై ఉన్న క్యూరియాసిటీ మరింత పెరిగింది.
ఈ సందర్బంగా నిర్మాత దందమూడి అవనీంద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘‘కథ వెను కథ’ సినిమాను మార్చి 24న రిలీజ్ చేస్తున్నాం. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. విశ్వంత్, సునీల్ సహా ఎంటైర్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది. దర్శకుడు కృష్ణ చైతన్యగారు మూవీని ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు. గంగనమోని శేఖర్, ఈశ్వర్ విజువల్స్, శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. కచ్చితంగా సినిమా అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు.
ఈ సినిమాలో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ, అలీ, సునీల్, జయ ప్రకాష్, బెనర్జీ, రఘు బాబు, సత్యం రాజేష్, మధు నందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, ఈరోజుల్లో సాయి, రూప తదితరులు నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Tollywood, Tollywood actor