• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DANCEE PLUS SHOW PROMO MONAL AND ANNE MASTER TURNS EMOTIONAL WITH CONTESTANT DANCE MNJ

Dancee Plus: ఏడ్చేసిన మోనాల్, ఆనీ మాస్ట‌ర్.. కంటెస్టెంట్‌తో ఆటోగ్రాఫ్ తీసుకున్న మాస్ట‌ర్

Dancee Plus: ఏడ్చేసిన మోనాల్, ఆనీ మాస్ట‌ర్.. కంటెస్టెంట్‌తో ఆటోగ్రాఫ్ తీసుకున్న మాస్ట‌ర్

మోనాల్ ఆనీ మాస్టర్

Dancee Plus: ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మాలో వ‌చ్చే డ్యాన్స్ ప్ల‌స్ షో అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఓంకార్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షోలో ఎంతోమంది టాలెంటెడ్ డ్యాన్స‌ర్లు పాల్గొన్నారు. ఒక‌రికి మించి ఒక‌రు డ్యాన్స్‌ల‌లో పోటీ ప‌డుతూ అద‌ర‌గొట్టేస్తున్నారు.

  • Share this:
    Dancee Plus: ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మాలో వ‌చ్చే డ్యాన్స్ ప్ల‌స్ షో అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఓంకార్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షోలో ఎంతోమంది టాలెంటెడ్ డ్యాన్స‌ర్లు పాల్గొన్నారు. ఒక‌రికి మించి ఒక‌రు డ్యాన్స్‌ల‌లో పోటీ ప‌డుతూ అద‌ర‌గొట్టేస్తున్నారు. ఇక ఈ షోకు జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న బాబా భాస్క‌ర్, ర‌ఘు, య‌శ్, ముమైత్ ఖాన్, ఆనీ, మోనాల్‌లు సరైన జ‌డ్జిమెంట్‌లు ఇవ్వ‌డంతో పాటు కామెడీని కూడా పండిస్తున్నారు. కాగా ప్ర‌తి వారం ఒక కొత్త థీమ్‌తో కొన‌సాగుతున్న ఈ డ్యాన్స్ షోలో మ‌రో ఎలిమినేష‌న్ జ‌ర‌గనుంది. ఈ మేర‌కు తాజాగా విడుద‌ల చేసిన ప్రోమోలో.. ఈ వారం రెండో ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌నున్న‌ట్లు ఓంకార్ వెల్ల‌డించారు.

    ఇదిలా ఉంటే ఈ ప్రోమోలో జియా త‌న డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టేసింది. జియా డ్యాన్స్‌కి బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్ స్టేజ్ మీద‌కు వ‌చ్చి ప్ర‌శంస‌లు కురిపిస్తాడు. మ‌రోవైపు రామ్ ల‌క్ష్మ‌ణ్ ఇద్ద‌రు ఒకే ఒక జీవితం పాట‌కు డ్యాన్స్ వేయ‌గా.. అది అందరినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలో య‌శ్ మాస్ట‌ర్ మాట్లాడుతూ.. రామ్ న‌న్ను ఒక‌సారి ఆటోగ్రాఫ్ కోరాడు. కానీ ఇప్పుడు అత‌డి ఆటోగ్రాఫ్ నేను తీసుకుంటాను అని అడుగుతాడు. ఇక రామ్-ల‌క్ష్మ‌ణ్ త‌ల్లి ఇలాంటి కొడుకులు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని భావోద్వేగానికి గురి అవుతారు.



    ఇక మ‌రో కంటెస్టెంట్లు విశ్వాసంలోని ఆరారిరారో రారో అనే పాట‌కు డ్యాన్స్ వేయ‌గా.. ఆనీ మాస్ట‌ర్, మోనాల్ భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న జీవితంలో ఇప్ప‌టికీ తాను ఒకటి మిస్ అవుతుంటాన‌ని.. నాన్న చెయ్యి ప‌ట్టుకొని న‌డుస్తుంటే, తల‌పై నాన్న నిమిరేది ఎలా ఉంటుందో తెలీద‌ని, ఆ ఫీల్‌ని నేను పొంద‌లేక‌పోయాన‌ని ఏడ్చేస్తారు. ఇక సాధార‌ణంగానే చిన్న విష‌యానికే భావోద్వేగానికి గుర‌య్యే మోనాల్ సైతం ఆ డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్ జ‌రుగుతున్న‌ప్పుడు ఏడుస్తుంది. ఇక వీరితో పాటు ముమైత్ ఖాన్ సైతం భావేద్వేగానికి గురి అవుతారు.
    Published by:Manjula S
    First published: