• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DANCEE PLUS REALITY SHOW PROMO WAR OF WORDS BET WEEN MUMAIT KHAN ANNE MASTER MNJ

Dancee Plus: జడ్జిల మధ్య వార్.. అనీ మాస్టర్‌ని వెళ్లిపోమన్న ముమైత్ ఖాన్

Dancee Plus: జడ్జిల మధ్య వార్.. అనీ మాస్టర్‌ని వెళ్లిపోమన్న ముమైత్ ఖాన్

డ్యాన్స్ ప్లస్

Dancee Plus: ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మాలో వ‌చ్చే రియాలిటీ షో డ్యాన్స్ ప్ల‌స్ అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఓంకార్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షోలో టాలెంటెడ్ డ్యాన్స‌ర్లు టైటిల్ కోసం పోటీ ప‌డుతున్నారు ఒక‌రికి మించి ఒక‌రు డ్యాన్స్‌ల‌లో పోటీ ప‌డుతూ అద‌ర‌గొట్టేస్తున్నారు.

  • Share this:
    Dancee Plus: ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మాలో వ‌చ్చే రియాలిటీ షో డ్యాన్స్ ప్ల‌స్ అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఓంకార్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షోలో టాలెంటెడ్ డ్యాన్స‌ర్లు టైటిల్ కోసం పోటీ ప‌డుతున్నారు ఒక‌రికి మించి ఒక‌రు డ్యాన్స్‌ల‌లో పోటీ ప‌డుతూ అద‌ర‌గొట్టేస్తున్నారు. శ‌నివారం, ఆదివారం ప్ర‌సారం అవుతున్న ఈ షోకు బాబా భాస్క‌ర్, ర‌ఘు, య‌శ్, ముమైత్ ఖాన్, ఆనీ, మోనాల్‌లు జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ షోలో మ‌రో ఎలిమినేష‌న్ ఉండ‌బోతోంది. దీనికి సంబంధించి ప్ర‌క్రియలో భాగంగా జ‌డ్జిల మ‌ధ్య వార్ గ‌ట్టిగా జ‌ర‌గ‌బోతోంది. ఈ డ్యాన్స్ షో తాజా ప్రోమోను రిలీజ్ చేయ‌గా.. అందులో జ‌డ్జిల మ‌ధ్య వార్‌ని చూపించారు.

    ఎలిమినేష‌న్ కోసం బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్.. డ్యాన్స‌ర్లు రామ్ ల‌క్ష్మ‌ణ్‌ని ఎంపిక చేశారు. మ‌రోవైపు అనీ మాస్ట‌ర్ కూడా వారినే ఎంపిక చేశారు. ఇక రామ్ ల‌క్ష్మ‌ణ్ ముమైత్ ఖాన్ టీమ్ కాగా.. ఆమె షాక్‌కి గురైంది. వారిని ఎలా ఎంపిక చేస్తార‌ని అడ‌గ్గా.. త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అనీ మాస్ట‌ర్ అన్నారు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. మీ జ‌డ్జిమెంట్‌ని నేను గౌర‌వించిన‌ప్పుడు.. నా జ‌డ్జిమెంట్‌ని మీరు గౌర‌వించాలంటూ అనీ మాస్ట‌ర్ ముమైత్ ఖాన్‌తో అన్నారు.


    అంతేకాదు మైండ్ గేమ్‌తో చూపిస్తున్నారంటూ ముమైత్ ఖాన్‌, అనీ మాస్ట‌ర్‌ని ఉద్దేశించి మాట్లాడారు. దీంతో హ‌ర్ట్ అయిన అనీ మాస్ట‌ర్.. అలా అన‌డాన్ని నేను ఒప్పుకోన‌ని.. కావాలంటే త‌న‌ను బ‌య‌ట‌కు పంప‌మ‌ని అన‌గా.. వెళ్లిపో అంటూ ముమైత్ ఖాన్ అన్నారు. ఒక్క‌రు కాదు ఐదు మంది మాస్ట‌ర్‌లు రామ్ ల‌క్ష్మ‌ణ్‌కి ఓటేశారంటూ తెలిపారు. మొత్తానికి ప్రోమోలో ఫుల్ హీట్ ఉండ‌గా.. మ‌రి ఎపిసోడ్‌లో ఎంత ఉండ‌బోతుందో చూడాలి.
    Published by:Manjula S
    First published: