Dancee Plus: సేమ్ సీన్ రిపీట్.. అంత‌లోనే ముమైత్ ఖాన్‌కి షాక్ ఇచ్చిన బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్

బాబా మాస్టర్ ముమైత్ ఖాన్

Dancee Plus: ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మాలో వ‌చ్చే రియాలిటీ షో డ్యాన్స్ ప్ల‌స్ అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఓంకార్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షోలో టాలెంటెడ్ డ్యాన్స‌ర్లు టైటిల్ కోసం పోటీ ప‌డుతున్నారు ఒక‌రికి మించి ఒక‌రు డ్యాన్స్‌ల‌లో పోటీ ప‌డుతూ అద‌ర‌గొట్టేస్తున్నారు.

 • Share this:
  Dancee Plus: ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మాలో వ‌చ్చే రియాలిటీ షో డ్యాన్స్ ప్ల‌స్ అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఓంకార్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షోలో టాలెంటెడ్ డ్యాన్స‌ర్లు టైటిల్ కోసం పోటీ ప‌డుతున్నారు ఒక‌రికి మించి ఒక‌రు డ్యాన్స్‌ల‌లో పోటీ ప‌డుతూ అద‌ర‌గొట్టేస్తున్నారు. శ‌నివారం, ఆదివారం ప్ర‌సారం అవుతున్న ఈ షోకు బాబా భాస్క‌ర్, ర‌ఘు, య‌శ్, ముమైత్ ఖాన్, ఆనీ, మోనాల్‌లు జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ షోలో మ‌రో ఎలిమినేష‌న్ ఉండ‌బోతోంది. ఎలిమినేష‌న్‌ని నామినేష‌న్ ప్రారంభించాలంటూ ఓంకార్ జ‌డ్జిల‌కు తెలిపారు. దీనికి సంబంధించి ఇటీవ‌ల ప్రోమోలు విడుద‌ల అయ్యాయి. ఈ క్ర‌మంలో అంత‌కుముందు ఎపిసోడ్‌లో సీన్ రిపీట్ అయ్యింది. ఎవ‌రినో ఒక‌రిని ఎలిమినేట్ చేయాల‌ని ఓంకార్ మాస్ట‌ర్ జ‌డ్జిల‌కు చెప్పాడు. దీంతో గ‌తంలో ఎపిసోడ్‌లోలాగే అంద‌రూ రామ్- ల‌క్ష్మ‌ణ్‌ని ఎలిమినేట్ చేస్తారు.

  మొద‌ట య‌శ్ మాస్ట‌ర్ రామ్-ల‌క్ష్మ‌ణ్‌ల‌ను ఎంపిక చేయ‌గా.. నాకు తెలుసు అంద‌రి నిర్ణ‌యం ఏంటో అని ముమైత్ ఖాన్ అంటుంది. అలా అనుకోకూడ‌దు క‌దా అని ఓంకార్ అన‌గా.. కావాలంటే మీరే చూడండి అని ముమైత్ చెబుతుంది. ఆ త‌రువాత ర‌ఘు మాస్ట‌ర్ నేను ఎప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ల‌ను చూస్తా.. ఈసారి వీక్ కంటెస్టెంట్‌లుగా ఉన్న రామ్-ల‌క్ష్మ‌ణ్‌ల‌ను ఎలిమినేట్ చేస్తా అని అంటాడు. ఇక అనీ మాస్ట‌ర్ కూడా రామ్-ల‌క్ష్మ‌ణ్‌ల‌ను ఎంపిక చేస్తారు.  ఇక ముమైత్ ఖాన్ న‌వ్వుతూ ఉండ‌గా.. ఎందుకు న‌వ్వుతున్నార‌ని ఓంకార్ ప్ర‌శ్నిస్తాడు. ఇది త‌న‌కు తెలుసని ఆమె చెబుతుంది. అయితే అదే స‌మ‌యానికి బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్ ముమైత్‌కి షాక్ ఇస్తాడు. తాను ఎమ్ఎమ్‌కేను ఎంపిక చేస్తున్న‌ట్లు బాబా చెబుతాడు. దీంతో ఇదేం ట్విస్ట్ అని ముమైత్ అంటుంది. మొత్తానికి అప్ప‌టికే ముగ్గురు రామ్-ల‌క్ష్మ‌ణ్‌ని ఎంపిక చేయ‌గా.. వారు ఎలిమినేష‌న్ అవుతారా లేదా అన్న‌ది చూడాలంటే ఆదివారం వ‌ర‌కు ఆగాల్సిందే.
  Published by:Manjula S
  First published: