HOME »NEWS »MOVIE »dancee plus promo yash master wife varsha comments on monal gajjar mnj

Monal Gajjar: మరోసారి మోనాల్‌తో దొరికిపోయిన డ్యాన్స్‌ మాస్టర్.. ముసలోడు అయినా వదలవా నువ్వు అన్న భార్య‌

Monal Gajjar: మరోసారి మోనాల్‌తో దొరికిపోయిన డ్యాన్స్‌ మాస్టర్.. ముసలోడు అయినా వదలవా నువ్వు అన్న భార్య‌
Monal Gajjar terrific dance moments for nakkilisu golusu song

స్టార్ మాలో వ‌స్తోన్న డ్యాన్స్ ప్ల‌స్ షోలో ఒక జడ్జిగా వ్య‌వ‌హరిస్తోంది మోనాల్(Monal Gajjar). శ‌ని, ఆదివారం రానున్న ఈ షోలో కంటెస్టెంట్‌లు అదిరిపోయే ప‌ర్ఫామెన్స్‌లు ఇస్తున్నారు. కాగా ఈ షోలో మోనాల్‌తో య‌శ్ మాస్ట‌ర్(Yash Master) పులిహోర క‌ల‌ప‌డం, మ‌ధ్య‌లో య‌శ్ మాస్ట‌ర్ భార్య వ‌ర్ష(Varsha) ఎంట్రీ ఇవ్వ‌డం, ఏడ‌వ‌డం.. వీక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.

  • Share this:
    Monal Gajjar: బిగ్‌బాస్ 4తో మ‌రింత క్రేజ్‌ని సంపాదించుకున్న గుజ‌రాతీ బ్యూటీ మోనాల్ గ‌జ్జ‌ర్ ప్ర‌స్తుతం బిజీగా మారింది. మొన్న‌టికి మొన్న బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం అల్లుడు అదుర్స్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది మోనాల్. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ప్ర‌స్తుతం స్టార్ మాలో వ‌స్తోన్న డ్యాన్స్ ప్ల‌స్ షోలో ఒక జడ్జిగా వ్య‌వ‌హరిస్తోంది మోనాల్. శ‌ని, ఆదివారం రానున్న ఈ షోలో కంటెస్టెంట్‌లు అదిరిపోయే ప‌ర్ఫామెన్స్‌లు ఇస్తున్నారు. కాగా ఈ షోలో మోనాల్‌తో య‌శ్ మాస్ట‌ర్ పులిహోర క‌ల‌ప‌డం, మ‌ధ్య‌లో య‌శ్ మాస్ట‌ర్ భార్య వ‌ర్ష ఎంట్రీ ఇవ్వ‌డం, ఏడ‌వ‌డం.. వీక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. ఇక ఈ షోకు సంబంధించి తాజాగా మ‌రో ప్రోమో విడుద‌ల అయ్యింది.

    డ్యాన్స్ విత్ జ‌డ్జెస్ థీమ్‌తో ఈ ఎపిసోడ్ ఉండ‌నుండ‌గా.. ఇందులో కంటెస్టెంట్‌ల‌తో పాటు జ‌డ్జిలు అదిరిపోయే ప‌ర్ఫామెన్స్‌లు ఇవ్వ‌నున్నారు. ఇక ఇందులో భాగంగా య‌శ్ మాస్ట‌ర్.. ముస‌లి గెట‌ప్ వేసుకొని య‌శ్ మాస్ట‌ర్ డ్యాన్స్ వేశాడు. ఆ ప‌ర్ఫామెన్స్ త‌రువాత మోనాల్ స్టేజ్ మీద‌కు వ‌చ్చి య‌శ్ మాస్ట‌ర్‌ని హ‌గ్ చేసుకుంటుంది. అదే స‌మ‌యంలో వ‌ర్ష వ‌స్తుంది.





    మోనాల్ వ‌ద్ద‌కు వెళ్లే వ‌ర్ష‌.. ముస‌లోడు అయినా వ‌ద‌ల‌వా నువ్వు అని అడుగుతుంది. ఆ త‌రువాత మోనాల్ ద‌గ్గ‌ర‌కి వెళ్లిన‌ప్పుడే వ‌స్తావు ఎందుక‌లా అని య‌శ్ మాస్ట‌ర్ అడ‌గ్గా.. ఏడ‌వ‌డం స్టార్ట్ చేస్తుంది. అస‌లు ఇలా ద‌గ్గ‌ర‌గా హ‌గ్ చేసుకుంటున్నాడంటూ వర్ష‌ త‌న ఏడుపును కంటిన్యూ చేస్తుండ‌గా.. అలా కాదు ఇలా అంటూ మ‌రోసారి య‌శ్ మాస్ట‌ర్ మోనాల్‌ని హ‌గ్ చేసుకుంటాడు. ఇక ఆ త‌రువాత ముస‌లోడు అయినా మా ఆయ‌న బావున్నాడు అని వ‌ర్ష చెప్ప‌గా.. అయితే ముద్దు పెట్టు అని ఓంకార్ అంటాడు. దానికి వ‌ర్ష ఆలోచిస్తుండ‌గా.. మిగిలిన వాళ్లు ముద్దులు పెడుతున్నారు, నువ్వు మాత్రం ముద్దు పెట్టేందుకు ఆలోచిస్తున్నావు అని అంటాడు. కామెడీతో వ‌చ్చిన ఈ ప్రోమో బాగా ఆక‌ట్టుకుంటోంది.
    Published by:Manjula S
    First published:January 12, 2021, 17:43 IST

    टॉप स्टोरीज