హోమ్ /వార్తలు /సినిమా /

Dancee Plus: శ్రీదేవి పాటకు సౌర్య.. సంగీత పాటకు హిమ.. డ్యాన్స్ తో అదరగొట్టేసిన 'కార్తీక దీపం' కవలలు

Dancee Plus: శ్రీదేవి పాటకు సౌర్య.. సంగీత పాటకు హిమ.. డ్యాన్స్ తో అదరగొట్టేసిన 'కార్తీక దీపం' కవలలు

హిమ సౌర్య

హిమ సౌర్య

తెలుగు బుల్లితెర‌పై నంబ‌ర్ 1 సీరియ‌ల్‌గా కొన‌సాగుతోన్న కార్తీక దీపంలో డాక్ట‌ర్ బాబు, వంట‌లక్క కుమార్తెలుగా సౌర్య‌(బేబి కృతిక‌), హిమ(బేబి స‌హృద‌) అద్భుత న‌ట‌నను క‌న‌బరుస్తున్నారు. సొంత అక్కా చెల్లెల్లా అన్న‌ట్లుగా ఈ ఇద్ద‌రు త‌మ స‌హ‌జ న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేస్తున్నారు

ఇంకా చదవండి ...

  Dancee Plus: తెలుగు బుల్లితెర‌పై నంబ‌ర్ 1 సీరియ‌ల్‌గా కొన‌సాగుతోన్న కార్తీక దీపంలో డాక్ట‌ర్ బాబు, వంట‌లక్క కుమార్తెలుగా సౌర్య‌(బేబి కృతిక‌), హిమ(బేబి స‌హృద‌) అద్భుత న‌ట‌నను క‌న‌బరుస్తున్నారు. సొంత అక్కా చెల్లెల్లా అన్న‌ట్లుగా ఈ ఇద్ద‌రు త‌మ స‌హ‌జ న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేస్తున్నారు. కాగా ఈ ఇద్ద‌రు ఇప్పుడు డ్యాన్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకోనున్నారు. స్టార్ మాలో డ్యాన్స్ ఫ్ల‌స్ రియాలిటీ షో ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే. బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న ఈ షోకు ఓంకార్ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌ఘు మాస్ట‌ర్, బాబా భాస్క‌ర్, యశ్ మాస్ట‌ర్, మోనాల్, ఆనీ మాస్ట‌ర్, ముమైత్ ఖాన్ జ‌డ్జిలుగా ఉన్నారు. ఇక వారానికో థీమ్‌తో ఈ షో కొన‌సాగుతోంది.

  ఈ క్ర‌మంలో ఈ వారం డ్యాన్స్ విత్ సెల‌బ్రిటీ అనే కొత్త థీమ్‌ని తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, స్టార్ మా సీరియ‌ళ్ల‌లో న‌టించే వారు డ్యాన్స‌ర్ల‌తో పాటు డ్యాన్స్ చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో సౌర్య‌, హిమలు ఇందులో డ్యాన్స్ వేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమో తాజాగా విడుద‌ల అయ్యింది.

  అందులో సౌర్య‌.. 16ఏళ్ల వ‌య‌స్సు మూవీలోని శ్రీదేవి పాట సిరిమ‌ల్లె పువ్వకు ఓ టీమ్‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌బోతోంది. అలాగే సౌర్య.. ఖ‌డ్గంలోని అహ అల్ల‌రి అల్ల‌రి చూపులతో పాట‌కు మ‌రో కంటెస్టెంట్‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌నుంది. వీరితో పాటు బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లు మెహ‌బూబ్, హారిక‌లు కూడా ఈ వారం త‌మ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీయ‌బోతున్నారు. ఇక ఈ ప్రోమోతో ఈ వారం ఎపిసోడ్‌పై ఆస‌క్తి మ‌రింత పెరిగింది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam

  ఉత్తమ కథలు