రెబెల్‌స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది.ఇటలీ తరహాలో ఓ భారీ సెట్‌ను వేసి మూడు వందల యాబైకు పైగా డాన్సర్స్‌తో ఈ పాటను చిత్రీకరిస్తున్నారట. ఈ పాటకు సంబంధించిన ఓ చిన్న క్లిప్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సెట్స్‌లోని ఓ వ్యక్తి రహస్యంగా చిత్రీకరించాడు. ఇందులో ప్రభాస్ వైట్ డ్రెస్ వేసుకుని పూజా హెగ్డేతో స్టెప్పులేస్తున్నాడు. యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఫుటేజ్ బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాధేశ్యామ్ ఆన్ సెట్ వీడియో క్లిప్ బయటకు రావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఈ సంక్రాంతికి తప్పకుండా రాధేశ్యామ్ టీజర్ విడుదలవుతుందని సాక్షాత్తూ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెప్పినా కూడా టీజర్ విడుదల కాలేదు. ఈ సంక్రాంతికి పవన్‌కల్యాణ్ వకీల్‌సాబ్ సహా చాలా మంది హీరోలకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి. మరి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో చాలా నిరుత్సాహపడ్డారు. ఇప్పటి వరకు బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అనే మోషన్ పోస్టర్, సాధారణ పోస్టర్స్ తప్ప రాధేశ్యామ్‌కు సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేవు. మరి సంక్రాంతికి టీజర్ అప్‌లోడ్ అవుతుందని చెప్పిన రాధాకృష్ణ కుమార్ ఫ్యాన్స్‌కు ఏమని సమాధానం చెబుతాడో చూడాలి.
Sorry for late
As I said
Here it is #Prabhas#RadheShyam#Radheshyamteaser pic.twitter.com/Xz7lsjoxWu
— @NameSalaar (@namesaaho) January 10, 2021
పీరియాడికల్ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న రాధేశ్యామ్‌ను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణామూవీస్ బ్యానర్స్‌పై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో వైపు శుక్రవారం ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై తను చేయబోయే నెక్ట్స్ మూవీ 'సలార్' షూటింగ్‌ను లాంఛనంగా ఈరోజు హైదరాబాద్‌లో స్టార్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, యష్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam