కరోనా ఎఫెక్ట్.. ఖర్చులకు డబ్బుల్లేక ప్రియుడి ఇంటికే కన్నం వేసిన నటి..

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఎంతోమంది పనిలేకుండా పోయారు. కొందరు అయితే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2020, 7:58 PM IST
కరోనా ఎఫెక్ట్.. ఖర్చులకు డబ్బుల్లేక ప్రియుడి ఇంటికే కన్నం వేసిన నటి..
తమిళ నటి సుచిత్ర (daivamagal actress suchitra)
  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఎంతోమంది పనిలేకుండా పోయారు. కొందరు అయితే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి పని లేకుండా పోయింది. కేవలం సినిమా షూటింగ్స్‌పైనే ఆధారపడే లేబర్స్.. నటీనటులు ఎన్నో వేలమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దాంతో చాలా మంది రోజువారీ పని కూడా చేస్తున్నారు. మరికొందరు మాత్రం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇదిలా ఉంటే ఓ నటి మాత్రం కరోనా సమయంలో ఆర్థిక సమస్యల కారణంగా ఏకంగా దొంగ అయిపోయింది.
తమిళ నటి సుచిత్ర (daivamagal actress suchitra)
తమిళ నటి సుచిత్ర (daivamagal actress suchitra)


అది కూడా తన ప్రియుడి ఇంట్లోనే దొంగతనం చేసింది. దేవత సహా ఇతర సీరియల్స్‌‌లో నటించిన సుచిత్ర అనే నటి ఇప్పుడు దొంగతనం కేసులో బుక్కైపోయింది. సీరియల్స్‌తో గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఈమె కొన్నేళ్లుగా చెన్నైలో సినిమా వాళ్ల దగ్గర డ్రైవర్‌గా పని చేసే మణికందన్‌తో సహజీవనం చేస్తుంది. అలాగే సైడ్ బిజినెస్ కింద ఆయనతో కలిసి దొంగతనాలు కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తన ప్రియుడి ఇంట్లోనే దొంగతనం చేసి అడ్డంగా బుక్ అయిపోయింది సుచిత్ర.
తమిళ నటి సుచిత్ర (daivamagal actress suchitra)
తమిళ నటి సుచిత్ర (daivamagal actress suchitra)

ప్రియుడు మణికందన్‌కు ఇది వరకే పెళ్లైంది.. అయినా కూడా అతడితో సుచిత్ర సహజీవనం చేస్తుంది. చెన్నైలో టీవి, సినీ నటులకు డ్రైవర్‌గా పని చేస్తున్న సమయంలోనే సుచిత్రతో పరిచయం ఏర్పడింది.. అలాగే ఆమెను లోబరుచుకున్నాడు మణికందన్. ఇక లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఉండటంతో సుచిత్ర ప్లాన్ మేరకు మణికందన్ తన తండ్రి ఇంటిలోనే 50 వేల నగదుతో పాటు 18 సవరాల బంగారం దొంగిలించాడు. ఆ తర్వాత మణికందన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ ప్రధాన సూత్రదారి సుచిత్ర మాత్రం ఇప్పటికీ పరారీలోనే ఉంది. కడలూరు జిల్లా పన్రుతిలో ఈ ఘటన జరిగింది.
Published by: Praveen Kumar Vadla
First published: September 16, 2020, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading