Home /News /movies /

DAGGUBATI RANA SAI PALLAVI VIRATA PARVAM TRAILER RELEASED SLB

Virata Parvam Trailer: నోరు లేని సమాజానికి నోరందించారు అన్నలు.. రోమాలు నిక్కబొడిచే డైలాగ్స్

Photo Twitter

Photo Twitter

Virata Parvam Trailer: దగ్గుబాటి రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాటపర్వం సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు, డైలాగ్స్ రోమాలు నిక్కబొచేలా ఉన్నాయి.

దగ్గుబాటి రానా ( Daggubati rana) హీరోగా రూపొందిన కొత్త సినిమా 'విరాటపర్వం' (Virata Parvam). వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రానాతో నాచురల్ క్వీన్ సాయి పల్లవి (Sai Pallavi) తెరపంచుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా వాయిదాల పర్వం కొనసాగింది. చివరకు జూన్ 17న (Virata Parvam Release Date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన యూనిట్.. ఆసక్తికర అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా నగాదారిలో సాంగ్ (Nagaadaarilo Song) లిరికల్ వీడియో వదిలిన మేకర్స్ తాజాగా విరాటపర్వం ట్రైలర్ (Virata Parvam Trailer) రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు.

మూడు నిమిషాల మూడు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తి రేపుతున్నాయి. రోమాలు నిక్కబొడిచే డైలాగ్స్‌తో విప్లవ కెరటం ఎగరేస్తోంది ఈ వీడియో. అడవిలో అన్నలను చూపిస్తూ సమాజానికి లింక్ చేసి అబ్బుర పరిచే విజువల్స్ జోడించారు మేకర్స్. కామ్రేడ్‌ రవన్నగా రానా కనిపించగా.. వెన్నెలగా సాయి పల్లవి తన నాచురల్ నటనతో అట్రాక్ట్ చేసింది. ఆలోచింపజేసే సన్నివేశాలతో పాటు ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ హైలైట్ చేసి ఈ ట్రైలర్ వదిలారు. ఇందులో సీనియర్‌ ఉద్యమకారుడు రఘన్నగా నవీన్‌ చంద్ర, కామ్రేడ్‌ భరతక్కగా ప్రియమణి కనిపించారు.

''చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు'' అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో ప్రారంభించి ప్రతి ఒక్క సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ''అతన్ని చూడాలని ఉందమ్మా.. నువ్వు గనక కనిపించేలా చేస్తే కోన్ని కోసి కల్లు శాక పోస్తా.. నాలో ఏదో భావోద్వేగం రగులుతోంది.. ఈ భావోద్వేగానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు'' అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్స్ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి. ''మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్ వాళ్ళు..'' అంటూ రాహుల్ రామకృష్ణ చెప్పిన డైలాగ్ సమాజ పరిస్థితులకు అద్దం పట్టింది.

''ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం ఒక ప్రాణం పోసింది'' అంటూ ఈ ట్రైలర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు రానా. విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. నక్సల్స్ నేపథ్యంలో ఓ డిఫరెంట్ కథగా ఈ విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయుధ పోరాటంతో పాటు రానా- సాయి పల్లవి మధ్య ప్రేమకథ సినిమాలో హైలైట్ కానుందని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ స్పష్టం చేసింది.

శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థల సంయుక్త సమర్పనిచ్చారుణలో రూపొందిన ఈ సినిమాకు డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ మఖ్యపాత్రలు పోషించారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Rana daggubati, Sai Pallavi, Virata Parvam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు