Home /News /movies /

DAGGUBATI ABHIRAM WANTS A CRAZY LOVE STORY FOR HIS DEBUT MOVIE PK

దగ్గుబాటి అభిరామ్ లవ్ స్టోరీ చేస్తాడంట.. శ్రీ రెడ్డి రియాక్షన్ ఏంటో..?

అభిరామ్ దగ్గుబాటితో శ్రీ రెడ్డి (abhiram sri reddy)

అభిరామ్ దగ్గుబాటితో శ్రీ రెడ్డి (abhiram sri reddy)

Abhiram Daggubati: తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న హీరోల్లో చాలా మంది వారసులే ఉన్నారు. ఇప్పుడు మరో వారసుడు ఈ లిస్టులో జాయిన్ అవుతున్నాడని తెలుస్తుంది.

తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న హీరోల్లో చాలా మంది వారసులే ఉన్నారు. ఇప్పుడు మరో వారసుడు ఈ లిస్టులో జాయిన్ అవుతున్నాడని తెలుస్తుంది. ఆయనే రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్. శ్రీ రెడ్డి పుణ్యమా అని అప్పట్లో ఈయన పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. అప్పట్లో తనతో ఎఫైర్ నడిపించాడని శ్రీ రెడ్డి ఓ రేంజ్‌లో అభిరామ్‌తో ఆటాడేసుకుంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈయన పేరు మళ్లీ వినిపిస్తుంది. చాలా రోజులుగా అభిరామ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
అభిరామ్ దగ్గుబాటి ఫైల్ ఫోటో (abhiram daggubati)
అభిరామ్ దగ్గుబాటి ఫైల్ ఫోటో (abhiram daggubati)

పైగా తాత రామానాయుడు జయంతి వేడుకల్లో కూడా అభిరామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నువ్వు ఉండుంటే ఇప్పటికే నేను హీరో అయ్యేవాన్ని తాత.. నువ్వు పోయి నన్ను హీరో కాకుండా ఆపేసావ్ అనేసాడు. రామానాయుడుకు అభిరామ్ అంటే చాలా యిష్టం. మనవడు ఏమడిగినా కాదనేవాడే కాదు.. నిజంగానే ఆయనుంటే ఈ పాటికి అభి హీరో అయ్యేవాడేమో..? ఆ మధ్య రాజు మహరాజు దర్శకుడు భాను శంకర్ ఈయన కోసం కథ కూడా సిద్ధం చేసాడని.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే అభి లాంఛ్ అవుతాడని వార్తలు కూడా వచ్చాయి.
రామానాయుడు 85వ జయంతి వేడుకలు (ramanaidu birth anniversary)
రామానాయుడు 85వ జయంతి వేడుకలు (ramanaidu birth anniversary)

ఆ సినిమా సంగతేమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అభిరామ్ తన తొలి సినిమా గురించి ఆసక్తికరమైన వార్త చెప్పాడు. తనకు లవ్ స్టోరీ చేయాలని ఉందని.. చేస్తానని చెప్తున్నాడు. అభిరామ్ లవ్ స్టోరీ అనగానే వెంటనే శ్రీ రెడ్డి పేరు గుర్తుకొస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఈమె చేసిన రచ్చ అలా ఉంది మరి. అప్పట్నుంచే రానాను బావా అని.. సురేష్ బాబును మామా అని పిలవడం అలవాటు చేసుకుంది శ్రీ రెడ్డి. రామానాయుడు స్టూడియోస్‌లోనే తమ ఫస్ట్ నైట్ కూడా అయిందంటూ అప్పట్లో పోస్ట్ చేసింది ఈ భామ. అలాంటిదిప్పుడు తన తొలి సినిమాకు ప్రేమకథను ఎంచుకుంటానంటే మాత్రం కచ్చితంగా శ్రీ రెడ్డి సెటైర్లు వేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sri Reddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు